Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

కొనసాగుతున్న గ్రామీణ తపాలా ఉద్యోగుల సమ్మె

 rural postal staff strike

మనతెలంగాణ/కోదాడ : కమలేష్ చం ద్రకమిటీ సిఫారస్‌లను అమలు చేయా లంటూ గత 14 రోజులుగా గ్రామీణ తపాలా ఉద్యోగులు స్థానిక కోదాడ పోస్టాఫీస్ బ్రాంచినందు సమ్మె నిర్వహి స్తున్నారు. సోమవారం హైదరాబాద్ మెయిన్ పోస్టాఫీస్‌కార్యాలయ ముట్టడికి కోదాడ గ్రామీణ తపాలా ఉద్యోగులు తరలి వెళ్ళారు. మిగితా గ్రామీణ ఉద్యో గు లు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 14 రోజులుగా గ్రామీణ తపాలా ఉద్యోగులు పిల్లలతో సహ రోడ్డెక్కి నిరసన తెలియజేస్తుంటే కేంద్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని వారు తెలిపారు. తాము న్యాయమైన డిమాండ్లకోసం పోరాడుతున్నామని, చాలిచాలని వేతనాలతో తమ కుటుంబాలను నెట్టుకొస్తున్నామని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ న్యాయమైన కోరికలు తీర్చి గ్రామీణ ఉద్యోగులందరికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్లకుంట బీపీఎం కే కన కేశ్వరరావు,చల్లా శ్రీనివాస్,నాగేశ్వరరావు, బుచ్చిబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments