Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

‘సామీ 2’ ఆఫీసియల్ ట్రైల‌ర్ విడుద‌ల‌

Saamy² official Theatrical Trailer Out now

చెన్నై: మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా వస్తున్న చిత్రం ‘సామీ 2’. తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీ ఆఫీసియల్ థియేట్రికల్ ట్రైల‌ర్ ను విడుద‌ల‌ చేసింది. 2003లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘సామీ’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో విక్రమ్ సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నాడు. ఇతర ముఖ్యపాత్రల్లో బాబి సింహా, ప్రభు, సూరి ముఖ్య నటిస్తున్నారు. శిబు థామీన్స్ నిర్మాణంలో ‘సామీ 2’ తెరకెక్కుతోంది. ట్రైలర్ లో మరోసారి విక్రమ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టాడు. తనదైన స్టంట్స్ తో చియాన్ ఆకట్టుకున్నాడు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.

Comments

comments