Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

రాబోయే ఎన్నికల్లో అధికారం చేపడుతాం

Sankineni Venkanna Speech About elections
మన తెలంగాణ/సూర్యాపేట : రాష్ట్రం ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తయినప్పటికీ తీవ్ర సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకొని రైతులకు గిట్టుబాటు ధరలు, సాగునీరు అందించి ఆదుకోవడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బాలాజి కన్వెన్షన్ హాల్‌లో జరిగిన భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల సమయంలో రైతులకు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రైతు ఆత్మహత్యలు ఉండవని, రైతే రాజవుతాడని కళ్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం జిల్లాలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వారి ఇళ్లకు వెల్లి సానుభూతి కూడా తెలియని మంత్రి జిల్లాలో ఉండన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి నాలుగు సంవత్సరాల పరిపాలనలో వంద శాతం ఇచ్చిన హామీలను అమలు చేసిందని చెప్తున్న ఇచ్చిన హామీలు దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తానని ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీ లక్ష ఉద్యోగాలు, ఇళ్లు లేని నిరుపేదలందరికీ డబల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని చెప్పి ఏ ఒక్కటి అమలు చేయని ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. రాబోయే గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బిజెపి కార్యకర్తలు సైనికులుగా పనిచేసి గ్రామ పంచాయితీలో ఎక్కువ మంది అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో సుమారు 50 మంది కార్యకర్తలు బిజెపిలో చేరారు. కేంద్రంలో, రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కొణతం సత్యనారాయణరెడ్డి,జిల్లా ఇన్‌ఛార్జి శ్రీధర్, బొబ్బ భాగ్యరెడ్డి, కర్నాటి కిషన్, అంజిబాబు, కృష్ణయ్య, రంగరాజు రుక్మారావు, గార్లపాటి మమతా రెడ్డి, సంకినేని వరుణ్, అరుణ్, కర్నాటి కిషన్,కౌన్సిలర్ చల్లమల్ల నర్సింహా, చివ్వెంల మండల అధ్యక్షులు రామ గిరి నగేష్, ఏడు కొండలు, ఫణినాయుడు, సలిగంటి వీరేంద్ర, అస్లాం, శారదాదేవి, మంగ్తా నాయక్, ఉమ, సురేష్, సాయిబాబా, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments