Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

విద్యార్థుల స్కాలర్‌షిప్పుల నిధులు విడుదలలో జాప్యం

Stop Distribute Passbooks To Farmers

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :
ప్రభుత్వ పెద్దలు కరుణించినా అధికారులు స్పందించకపోవడంతో ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎస్సీ, బిసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలన్న లక్షంతో ముందుకు సాగుతుంటే అధికారుల నిర్లక్షం మూలంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. ఇంటర్‌మీడియేట్, డిగ్రీలు చదువుతున్న ఎస్సీ, బిసి విద్యార్థులకు ప్రభుత్వం అందచేస్తున్న స్కాలర్‌షిప్పులకు ప్రభుత్వం నుంచి విడుదల చేసినా వాటిని విద్యార్థులు, యజమాన్యాల ఖాతాల్లోకి సకాలంలో వేయడంలో రంగారెడ్డి జిల్లా అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. 2017-18 విద్యాసంవత్సరంలో రంగారెడ్డి జిల్లాలో ఇంటర్, డిగ్రీలు చదువుతున్న విద్యార్థుల స్కాలర్‌షిప్ నిధులను గతంలో మాదిరిగా ఒకే సారి కాకుండా ప్రతి నెలా కొంత సొమ్మును విడుదల చేసేలా కళాశాల యజమాన్యాలతో ఒప్పందం చేసుకుంది. జి.ఓ 89, 90,91 ప్రకారం మే మాసానికి సంబంధించి నిధులను గత నెల మొదటివారంలోనే విడుదల చేసింది. జిల్లాలోని 16500 ఎస్సీ విద్యార్థులకు సంబంధించి రూ. 7.50 కోట్లు, 23500 బిసి విద్యార్థులకు సంబంధించి రూ. 11.50 కోట్లను ప్రభుత్వం జిల్లా బిసి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారుల ఖాతాలలో జమ చేసింది. ప్రభుత్వం తమ ఖాతాలో జమ చేసిన నిధులను ఆయా కళాశాలలు, విద్యార్థులను పరిగణలోనికి తీసుకుని బిల్లులు చెల్లింపులు చేయవలసిన రంగారెడ్డి జిల్లా బిసి, ఎస్సీ సంక్షేమ అధికారులు మాత్రం నిద్రమత్తు వీడకపోవడంతో జిల్లాలోని దాదాపు 40 వేల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతుండగా, కళాశాలలను నిర్వహిస్తున్న యజమాన్యాలు అప్పుల పాలవుతున్నాయి. స్కాలర్‌షిప్పుల ద్వారా వచ్చిన డబ్బులను ఫీజులుగా చెల్లించుకుని చదువు కొనసాగిస్తున్నారు చాలా మంది పేద విద్యార్దులు. స్కాలర్ షిపు బిల్లుల చెల్లింపు అనంతరం ఫీజురియింబర్స్‌మెంట్ నిధుల బిల్లుల చెల్లింపు ప్రక్రియ కొనసాగనుంది. ఎస్సీ, బిసి అధికారులు బిల్లులు తయారు చేసి నిధులు విడుదల చేయడంలో జాప్యం చేయడం మూలంగా కళాశాలలు సైతం ఇబ్బందులు పడుతున్నాయని పలువురు యజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

కష్టాల్లో ఎస్సీ, బిసి విద్యార్థులు…
పగలు, రాత్రనక కష్టపడి చదివి ఇంటర్ పాసై ఎంసెట్‌లో ర్యాంకు సంపాధించుకుని ఇంజనీరింగ్ చదవడానికి కౌన్సిలింగ్‌కు సిద్దమవుతుంటే ప్రభుత్వం స్కాలర్‌షిపులు/ఫీజురియింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయలేదు…డబ్బులు కట్టి సర్టీఫికేట్‌లో తీసుకుపోమ్మని కళాశాల యజమన్యాలు చెప్పుతుండటంతో విద్యార్దులు, వారి తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీ విద్యార్దుల పరిస్థీతి సైతం ఇలాగే మారింది. డిగ్రీ పాసై ఉన్నత చదువులు చదవడానికి సర్టిఫికేట్‌లో తీసుకుందామని కళాశాలలకు వెల్లిన విద్యార్దులకు ఇంత వరకు సర్టీఫికేట్‌లు ఇవ్వకపోవడం…కౌన్సిలింగ్‌కు గడువు దగ్గరపడుతుండటంతో ఎమిచేయాలో పాలుపోని పరిస్థీతులలో విద్యార్దులు, వారి తల్లితండ్రులు కళాశాలల చుట్టు తిరుగుతు యజమాన్యాలను ప్రాదేయపడుతున్నారు. కొంత మంది తల్లితండ్రులు ఇప్పటికే అప్పులు చేసి కళాశాలలో డబ్బులు కట్టి తమ పిల్లల సర్టిఫికేట్‌లను తీసుకుపోతుండటంతో మిగత వారు రోదిస్తున్నారు. జిల్లా అధికారులు తక్షణం స్పందించి విద్యార్దుల భవిష్యత్‌ను పరిగణలోనికి తీసుకుని కళాశాలలు, విద్యార్దుల చెల్లింపుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను అయా కళాశాలకు చెల్లించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Comments

comments