Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

మా ఊరికి బస్సును నడపాలి

School Students Wants Bus Come Thier Village

మనతెలంగాణ / సిద్దిపేట రూరల్ : పాఠశాల సమయానికి  మా ఊరి నుంచి  ప్రత్యేక బస్సును నడపాలని మాచాపూర్ , సీతారాంపల్లి కి చెందిన విద్యార్థులు  అధికారులను వేడుకుంటున్నారు.  మాచాపూర్, సీతారాంపల్లి గ్రామాల నుంచి ప్రతి రోజు 100 మంది విద్యార్థులు  మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న చింత మడక గ్రామ పాఠశాలకు కాలినడకన వెళుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.  అలాగే సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో కూడా బస్సులు నడపడం లేదని దాంతో విద్యార్థినులు ఇంటికి చేరే సమయానికి చీకటి పడడంతో వారి తల్లిదండ్రులు అందోళన చెందుతున్నారు.  ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల సమయానికి ఉదయం, సాయంత్రం బస్సులు నడపాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Comments

comments