Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

తస్మాత్ జాగ్రత్త…!

Selling of adulterous seed in the market

మార్కెట్‌లో కల్తీ విత్తనాలు                                                                                                                                          పేరున్న బ్రాండ్లతో నాసిరకం విత్తనాలు                                                                                                                          తెగుళ్లు ఆశించవని ప్రచారం                                                                                                                                        చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

మనతెలంగాణ/ ఖమ్మం: గ్రామాల్లో సాగు సందడి మొదలు కాగా మార్కెట్‌లో కల్తీ విత్తనాల అమ్మకాలు మొ దలయ్యాయన్న ఆరోపణలు వినవస్తున్నాయి. కల్తీ విత్తనాలను రైతులకు అంటగట్టేందుకు దళారులు రకరకా ల ప్రచారాలు చేస్తూ రైతులకు అంటగడుతున్నారు. బ్రాండెడ్ కంపెనీ పేరుతో నాసిరకంగా విత్తనాలు విక్రయిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. తమ కంపెనీ విత్తనాలను కొనుగోలు చేస్తే గులాబీ రంగు పు రుగులను తట్టుకుంటాయని, గడ్డి మందుకు ధీటుగా ఉంటాయని నమ్మిస్తూ నాసిరకం విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. కొన్ని విత్తన దుకాణాల్లో అనుమ తి ఒక రకం విత్తనాలకు ఉంటే మరో రకం విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నారు. దళారులు చెప్పే మాటలకు బోల్తా పడుతున్న రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చే సి తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రతి యేటా ఖరీఫ్ ప్రారంభ సమయంలో నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పిడి యాక్ట్‌లు నమో దు చేస్తామని చెబుతున్నప్పటికీ ఆ వైపుగా అధికార యంత్రాంగం దృష్టిసారించకపోవడంతో మార్కెట్‌లో యదేచ్ఛగా కల్తీ విత్తనాలు హల్‌చల్ చేస్తున్నాయి. ఐదేండ్లుగా ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తనాల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రతి ఏడాది తొలకరిలో వ్యవసాయాధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో నకిలీ విత్తనాలు కొని రైతాంగం తీవ్రంగా నష్టపోతుం ది. చేతులు కాలికా ఆకులు పట్టుకున్న చందంగా వ్యవసాయ శాఖ తీరు ఉంది. ఖమ్మం జిల్లాలో వరి విత్తనా లు 22,287 క్వింటాళ్లు, కంది 479 క్వింటాళ్లు, పెసర 1400, మినుము 314, మొక్కజొన్న 875, వేరుశనగ 165 క్వింటాళ్లు అవసరమవుతాయని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఈ ఏడాది పత్తి ప్యాకెట్లు 5.50 లక్షలకు పైగా అవసరం అవుతాయని గుర్తించారు. నకిలీ విత్తనాలు కొని రైతులు మోసపోకుండా నా ణ్యమైన ప్రముఖ కంపెనీ విత్తనాలను కొనుగోలు చేసి ఖరీఫ్ సాగు లాభసాటిగా చేసుకోవాలి.  లేని పక్షంలో మరల నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. విత్తనాలు కొనే ముందు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ధర తక్కువకు వస్తున్నాయని, అరువు ఇస్తున్నారని విత్తన కొనుగోళ్లలో కురచ ఆలోచనలు చేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదన్న వాస్తవాన్ని రైతులు గుర్తుంచుకోవాలి. విత్తనాలు కొనుగోలు చేసిన వెంటనే దుకాణదారుని వద్ద నుంచి రశీదు తీసుకోవాలి. అది పంట పూర్తిగా ఇంటికి వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉంచాలి. అదును ఉన్నప్పుడే విత్తు నాటాలి. వర్షం వస్తుందిలే అని, లేదంటే ఇక వర్షం రాలేదన్న ఊహాగానాలతో విత్తు నాటడం సరికాదు.

Comments

comments