Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

ప్రతిరోజు యోగా చేస్తే వీర్యం నాణ్యత పెరుగుతుంది

ఎయిమ్స్ అధ్యయనంలో వెల్లడి

Yoga

న్యూఢిల్లీ : రోజూ యోగా చేయడం వల్ల వీర్యంలో నాణ్యత పెరుగుతుందని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నిర్వహించిన పరిశోధన వెల్లడించింది. నేచర్ రివ్యూ యూరోలజి అనే అంతర్జాతీయ వైద్య మ్యాగజైన్‌లో ప్రచురించిన ఈ నివేదికలో ఆరోగ్యకరమైన శిశు జననాలకు ఇటువంటి  వీర్యం దోహదపడుతుందని తెలిపింది. వీర్యంలోని డిఎన్‌ఎ దెబ్బతినడం వల్ల  పిల్లలు కలిగే అవకాశాలు తగ్గి పోతాయని,  లేదా అబార్షన్ జరిగే అవకాశాలుంటాయని డాక్టర్ రిమా దాద తెలిపారు. ఎఐఐఎంఎస్‌లో  లెబోరేటరి ఆఫ్ మాలిక్యూలార్ రిప్రొడక్షన్ అండ్ జెనిటిక్స్,డిపార్ట్‌మెంట్ ఆఫ్ అనాటమీ విభాగాల హెడ్‌గా ఆమె పని చేస్తున్నారు. డిఎన్‌ఎ పాడై పోవడానికి ప్రధాన కారణం ఆక్సీడాంట్స్ ఉత్పత్తి అదుపులేకుండా సాగడమని, దీంతో వీర్యకణం దెబ్బతింటుందని ఆయన తెలిపారు. వాతావరణ కాలుష్యం, చీడపీడలను అరికట్టడానికి ఉపయోగించే మందుల ప్రభావం, విద్యు త్ అయస్కాంత క్షేత్రం, ధూమపానం, మద్యపానం,ఫాస్ట్ ఫుడ్ వంటివి కూడా  వీర్యకణం దెబ్బతినడానికి కారణమవుతాయని డాక్టర్ రిమా దాద తెలిపారు. ప్రతిరోజు యోగా చేయడం వల,్ల త్వరగా వృద్ధాప్యం వచ్చే అవకాశాలు తగ్గుతాయని తెలిపారు.

Comments

comments