Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

సింగరేణి బదిలీ వర్కర్ల వ్రాత పరీక్ష సుఖాంతం

Singaporean transfer worker's writing test is happy

కొత్తగూడెం/పాల్వంచ: తెలంగాణ రాష్ట్ర కొంగుబంగారం సిరుల తల్లి సింగరేణిలో తొలిసారిగా గిరిజన అభ్యర్థులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బదిలీ వర్కర్ల వ్రాత పరీక్ష ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుఖాంతంగా జరిగిన. 655 పోస్టులకు గాను ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 65 పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులు పరీక్షలు వ్రాసారు. వేల సంఖ్యలో పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు బారులు తీరారు. కొత్తగూడెంలో 20, పాల్వంచ 16 సెంటర్లు, ఖమ్మంలో 29 సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు. చాలా యేళ్ళ తరువాత సింగరేణిలో గిరిజన అభ్యర్థుల కోసం వెలువడిన నోటిఫికేషన్ కావడంతో ఉన్నత చదువులు అభ్యర్థులు సహితం పరీక్షలకు హాజరయ్యారు. సింగరేణిలో యస్‌టి బ్యాక్‌లాగ్ బదిలీ వర్కర్ల పోస్టుల కోసం సుమారు సంవత్సరం క్రితం నోటిఫికేషన్ విడుదల చేసారు. సింగరేణి భూ నిర్వాసితులు తగిన న్యాయం కోసం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా సుమారు సంవత్సర కాలం వాయిదా పడ్డ ఈ పరీక్షకు అడ్డంకులు తొలగి ఆదివారం నిర్వహించారు. అయినప్పటికి పరీక్ష ఫలితాలను వాయిదా వెయ్యవల్సిందిగా హైకోర్టు తీర్పునిచ్చింది. భూ నిర్వాసితులకు తగిన న్యాయం చేసే వరకు పరీక్ష ఫలితాలను విడుదల చేయకూడదని హైకోర్టు తమ ఉత్తర్వుల్లో పేర్కొంది. అభ్యర్థులు సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. కొందరు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా రావడంతో అధికారులు లోనికి అనుమతించని కారణంగా నిస్సాహాయంగా వెనుదిరిగారు. జిల్లా యస్‌పి ఆదేశానుసారం స్థానిక పోలీసులు పరీక్ష కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు.

Comments

comments