Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

ఈశాన్య భారతంలో భారీ వర్షాలు: ఆరుగురి మృతి

Heavy-Rain-in-Assam

దిస్‌పూర్: త్రిపుర్, మణిపూర్ లో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తాయి.  వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. వరదల ధాటికి త్రిపురలో నలుగురు, మణిపూర్ లో ఇద్దరు దుర్మరణం చెందారు. మణిపూర్ ప్రభుత్వం అన్ని స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  అస్సాంలో కురిసిన భారీ వర్షాలకు లండింగ్-బదర్‌పూర్ మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడడంతో నాలుగు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది అక్కడి చేరుకొని కొండచరియలను పక్కకు తొలగిస్తున్నారు.

Comments

comments