Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

కళాశాలల గుర్తింపులోనూ నత్తనడక!

Smashed in the recognition of colleges!

ప్రైవేటు కళాశాలల అనుబంధ గుర్తింపులో అధికారుల నిర్లక్షం!
ఏ కళాశాలకు గుర్తింపు ఉందో.. లేదో తెలియని స్థితిలో విద్యార్థులు, తల్లిదండ్రులు

మన తెలంగాణ/సిటీ బ్యూరో: ఇంటర్ విద్య ప్రాంతీయ అధికారుల నిర్లక్షం కాస్తా విద్యార్థులకు శాపంగా మారుతోంది. ప్రైవేట్ కళాశాలల అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) ప్రక్రియ నత్త నడకను తలపిస్తోంది. ఈ ప్రక్రియను మే 31వ తేదీ లోపు పూర్తి చేయాలని ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా జిల్లా ప్రాంతీయ అధికారులు మాత్రం మీనామేషాలు లెక్కిస్తున్నారు. దీంతో ఏ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఉందో? దేనికి లేదో తెలియక తీవ్ర అయోమయానికి గురవుతున్నారు.
ప్రైవేట్ కళాశాలలను కట్టడి చేయడమే లక్షంగా విద్యా సంవత్సరానికి ముందే అనుబంధ ప్రక్రియను పూర్తి చేయాలన్న ప్రభుత్వలక్షం అధికారులఅలసత్వం కారణంగా నీరుగారుతోంది. జిల్లాలో 278 ప్రైవేట్, 22 ప్రభుత్వ,17ఎయిడెడ్, సాంఘీక సంక్షేమ, రైల్వే 3,ఇలా మొత్తం 320 కళాశాలలున్నాయి. ఈ కళాశాలలలో ప్రతిఏటా ఇంటర్ బోర్డు అధికారులు తనిఖీలు నిర్వహించిబోర్డు అనుబంధ గుర్తింపును జారీ చేస్తూ ఉంటారు .ఇలా అనుబంధగుర్తింపు పొందిన కళాశాలల్లో చదివిన విద్యార్థులను మాత్రమే ఇంటర్ బోర్డు అధికారులు పరీక్షలకు అనుమతించడంతో పాటు స్కాలర్‌షిప్‌లు, బస్సుపాసుల సౌకర్యం కల్పిస్తారు. ఈ ప్రక్రియ గత ఏడాది వరకు అధికారులు, యాజమాన్యాల ఇష్టానుసారంగా జారీ చేస్తుండడంతో దీనిని ఆసరాగా చేసుకుని కొంతమంది ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే కళాశాలలను పెట్టి అందినకాడికి దండుకుని బోర్డులను తిప్పేయడమో,ఇతర కళాశాలలకు డబ్బులు చెల్లించి వారి గుర్తింపుపై పరీక్షలు రాయించడమో చేస్తున్నారు.మరికొన్ని సంస్థలు ఒక కళాశాల అనుమతి పలు కళాశాలలను నడుపుతున్నారు.ఇలాంటి సంస్థల ఆట కట్టించడంతో పాటు, అనుమతులు లేని కళాశాలను పూర్తిగా నివారించడమే లక్షంగా ఈ ఏడాది విద్యాసంవత్సరానికి ముందే అన్ని కళాశాల అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని విద్యశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టమైన అదేశాలు జారీ చేశారు.
108 కళాశాలల అనుబంధ గుర్తింపు పెండింగ్
ఇదే క్రమంలో విద్యాశాఖ ప్రాంతీయ అధికారులు మే నెలలోనే ప్రక్రియను ప్రారంభించినప్పటికీ ఇప్పటీ వరుకు మాత్రం దీనిని పూర్తి చేయలేకపోయారు. జిల్లా వ్యాప్తంగా 320 కళాశాలలుంగా ఇందులో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ కళాశాలల ప్రక్రియను పూర్తి చేశారు. ఇందులో 278 ప్రైవేట్ కళాశాలలుండగా, ఇంటర్ ప్రాంతీయ అధికారులు మాత్రం ఇప్పటీ వరకు 175 కళాశాలలను గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయగా, 103 కళాశాలల గుర్తింపు ప్రక్రియన ఇంకా పరిశీలన దశలో నే ఉన్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఎయిడెడ్ కళాశాలలు 17 ఉండగా, ఇందులో 12 పూర్తి కాగా, 5 కళాశాలల గుర్తింపు సైతం పరిశీలిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
అనుబంధ గుర్తింపు రాకపోతే పరిస్థితి ఏమిటి?
కళాశాలలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియ ఇప్పటికి పూర్తి కాకపోవడంతో ఆయా కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండులు తీవ్ర ఆందోళలను గురవుతున్నారు. ఒకవేళ తాము చదువుతున్న కళాశాలకు అనుబంధ గుర్తింపు లభించకపోతే తమ పరిస్థితి ఏమిటాంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడ్మిషన్లకు ముందే అనుబంధ గుర్తింపు ప్రక్రియను అధికారులు పూర్తి చేసిన జాబితాను ప్రకటించి ఉండాల్సిందని పేర్కొంటున్నారు. 13 రోజులు గడుస్తున్నా ఇంకా పరిశీలన దశలో ఉండడం అధికారుల నిర్లక్షం తమకు ఎక్కడా శాపంగా మారుతుతోందని భయాందోళనలకు గురవుతున్నారు. అనుబంధ గుర్తింపు ఉన్న వాటికి మాత్రమే ఆర్టీసీ విద్యార్థులకు బసు పాసులను మంజూరు చేస్తుండడంతో పెండింగ్ జాబితాలో ఉన్న కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు బసు పాసులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక భారంతో పలువురు ఇప్పటికీ కళాశాలకు వెళ్లలేకపోతుమన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments