Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

మామకు నమ్మకం కల్గించాలనే దొంగిలించా

పోలీసు వాహనాన్ని దొంగిలించిన వ్యక్తి అరెస్టు

Police

మన తెలంగాణ/సూర్యాపేట : మామకు తన పట్ల నమ్మకం కలగాలని, తానూ పోలీసు వృత్తిలో కొనసాగుతున్నానని నమ్మబలికేందుకు శనివారం సాయంత్రం పోలీసు వాహనాన్ని దొంగిలించిన నిందితుడితో పాటు మరో వ్యక్తిని జిల్లా ఎస్‌పి ప్రకాశ్‌జాదవ్ ఆదివారం మీడియం ముందు ప్రవేశపెట్టారు. వాహనాన్ని ఎత్తుకెళ్లడానికి గల కారణాలను వివరించారు. సూర్యాపేట పట్టణంలోని ఇం దిరమ్మ కాలనీకి చెందిన తిరుపతి లింగరాజుకు కొన్ని సంవత్సరాల కింద వివాహమైంది. వివాహ సమయంలో తనకు ఒప్పుకున్న కట్న కానుకల నిమిత్తం మామ వద్ద నుండి లింగరాజుకు కొంత స్థలం రావాల్సి ఉంది. ఎలాంటి ఉద్యోగం లేకుండా తిరుగుతున్న లింగరాజుకు స్థలాన్ని ఇప్పుడే ఇవ్వనని మామ తేల్చి చెప్పాడు. అందుకు తను పోలీసు వృత్తిలో ఉంటూ రూరల్ సిఐ వాహనాన్ని నడుపుతున్నానని తన మామ, భార్య నమ్మదగే విధంగా పోలీస్ వాహనాన్ని ఎత్తికెళ్లినట్లు విచారణలో వెల్లడైనదని ఎస్‌పి పేర్కొన్నారు.

పోలీస్ వాహనంలోనే టిఎస్ 09పిఎ 1568 కోదాడ మీదుగా ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలోని తన భార్య వద్దకు వెళ్లాడు. అక్కడి నుండి మరో నలుగురి స్నేహితులను అదే వాహనంలో ఎక్కించుకొని బీరు కాటన్‌లు వాహనంలో వేసుకొని జల్సా కోసం గుంటూరు వైపు వెళ్లాడు. అప్పటికే సమాచారం అం దుకున్న ఖమ్మం జిల్లా పోలీసులు లింగరాజుతో పాటు జగన్నాథం పురం గ్రామానికి చెందిన నివుడు అశోక్‌ను అదుపులోకి తీసుకున్నారు. లింగరాజు గతంలోనూ ఇలాగే ద్విచక్ర వాహనాన్ని తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. పలుమార్లు కొన్ని ప్రాంతాలలో తాను పోలీసు శాఖలో పనిచేస్తున్నానని వాహనాలను ఆపి డబ్బులు వసూలు చేసినట్లు ఎస్పీ చెప్పారు. లింగరాజు పోలీసు వాహనాన్ని చోరీ పోలీసులను ఉరుకులు… పరుగులు పెట్టించాడు. పోలీసు వాహనాన్ని ఐదు గంటల్లోనే పోలీసులు ఛేదించిన జిల్లాల పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Comments

comments