Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

బాలికల ఆరోగ్య, విద్య, సంరక్షణపై

Special focus on health and education

మనతెలంగాణ/సూర్యాపేట : ప్రభుత్వ, ప్రైవేటు పాఠశా ల ల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు వివిధ రకాల సమస్యలతో సతమతమవుతున్నారు. అందులో బాలికలు ప్రత్యేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. విద్యా ర్థులకు అన్ని రకాల మౌలిక వసతులు ప్రభుత్వం కల్పిస్తున్న ప్పటికీ మరే కారణాలతో వారు ఇబ్బందులకు గురవుతు న్నారు. సమాజ ంలో బాలికలపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా..ఆశించిన స్థా యిలో మా ర్పు కన్పించడం లేదు. పలు పాఠశాలల్లో విద్యాబుద్ధలు నే ర్పాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థినిలపై వేధింపులకు పాల్పడడం లాంటి సంఘటనలు చోటు చేసు కుంటున్నాయి. పోషకాలతో కూడిన భోజనం అందించకపో వడ ంతో రక్తహీనత తో పాటు మరికొన్ని సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సంఘటనలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి న జాతీయ బాలల హక్కుల సం రక్షణ కమీషన్ రాష్ట్ర విద్యా శాఖకు ఇటీవల పలు సూచనలు చేసింది. వాటిని ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా బాలికలఆరోగ్య,విద్య,సంరక్షణపైప్రత్యేకదృష్టి సారించనున్నారు.
ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి : పాఠశాలల్లో విద్యనభ్యసించే బాలికల సంపూర్ణ ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుంది. భాగంగా లైంగిక వేధింపులు, ఆరో గ్యం, విద్యపై ప్రధాన దృష్టి పెట్టనున్నారు. పాఠశాలల్లో ఎదురయ్యే లైంగిక వేధింపుల నుంచి కాపాడుకునేందుకు ప్రతి పాఠశాలలో ఒక మహిళ ఉపాధ్యాయురాలిని నియమించనున్నారు. అంతేగాక రుతుస్రావం సమయంలో బాలికలు ఐదు రోజుల పాటు పాఠశాలకు రావడం మానేస్తున్నారు. ఈ విషయంలో స ంబంధిత మహిళా ఉపాధ్యాయురాలు బాలికలకు ప్రత్యేకంగా సమస్యలను ఎలా ఎదుర్కొవాలి అనే విషయాలపై అవగాహన కల్పించే అవకాశం ఉంటుంది. పోషకాహారం అ ందకపోవడంతో బాలికలు రక్తహీనతతో పాటు పలు రకాల ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. చిన్ననాటి నుంచే ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకుంటే మహిళలు వివాహ అనంతరం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశముంది. మహిళలకు ఎక్కువగా రక్తహీనత కల్గుతుంది. అలాంటి విషయాలపై ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవా లని… అనారోగ్యాలకు గురికాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించనున్నారు. వీటితో పాటు ప్రధానమైందని విద్యలో రాణించడం అందుకోసం వారికి మంచి మాటలు చెబుతూ దండించకుండా విద్యపై ఆసక్తి కలిగి విద్యలో రాణించే విధంగా చర్యలు చేపట్టనున్నారు. అవసరమైతే మానసిక వైద్య నిపుణులను అందుబాటులో ఉంచి అవగాహన కల్పించనున్నారు. ప్రథమ చికిత్స, స్వీయ రక్షణం కోసం చర్యలు పడుతున్నారు. పలు పాఠశాలల్లో బాలికలకు ఆత్మరక్షణ కోసం కరాటేలో శిక్షణ ఇస్తున్న సందర్భాలు ఉన్నాయి.
13,150 మంది ఉపాధ్యాయులు : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 13,150 మంది ఉపాధ్యాయు లు వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారు. అం దులో సుమారు 4 వేల పై చిలుకు మహిళా ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే బాలికల సంపూర్ణ రక్షణ కోసం ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమానికి మహిళా ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉండే అవకాశముంది. ప్రతి పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉంది. మ హిళా ఉపాధ్యాయులు లేని పాఠశాలలు జిల్లాలో ఉన్నా యి. అలాంటి పాఠశాలల్లో బాలికల సమస్యల పరిష్కారానికి ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఇలాంటి సంఘటనలు ప్ర భుత్వం దృష్టిలో పెట్టుకొని చర్యలు చేపడితే బాగుంటుంది.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల్లో జిల్లాలో ఉన్న అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సుమారు లక్షా40 వేల మంది విద్యార్థు లు వివిధ తరగతుల్లో విద్యనభ్యసిస్తున్నారు. అందులో బాలికలు సుమారు 60 వేల మందికి పైగా ఉన్నారు. రోజు ఉదయం పాఠశాలలకు వ చ్చి సాయంత్ర సమయంలో వారి నివాసాలకు వెళ్తుం టారు. ఎక్కువ సమయం పాఠశాలల్లోనే గడుపుతున్నారు. అ లాంటి వారికి వివిధ రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. వా టిని పరిష్కరించుకునేందుకు ఎవరికీ చెప్పా లో తెలియని పరిస్థితి. కంచే చేనును మేసిన చందంగా పలువురు ఉపాధ్యాయులు బాలికలపై అసభ్యంగా ప్రవరిస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
విధుల పట్ల ఉపాధ్యాయులు
సమర్ధతతను చాటుకోవాలి : చైతన్య జైనీ, జిల్లా విద్యాశాఖాధికారి
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బోధించే ఉ పాధ్యాయులు తమ విధుల పట్ల సమర్థతతను చాటుకొని విద్యార్థులకు మార్గదర్శకాన్ని చూపాలి. దిశానిర్ధేశాన్ని చూపే ఉపాధ్యాయులు వి ద్యా ర్థుల ఉన్నత స్థానానికి ఎదిగేందుకు కృషి చేయాలి. ము ఖ్యంగా విద్యార్థుల పట్ల ఎటువంటి అ సభ్య ప్రవర్తన చేయరాదు. ప్రవర్తనలో తేడా కన్పిస్తే విధులను తొలగించుకున్నట్లే ప్రభుత్వ పాఠశాలల్లోని మహిళా ఉపాధ్యాయులలో ఒకరినీ ప్రత్యేక ఉపాధ్యాయురాలిగా నియమించే ఏర్పాటు చేస్తాం.
విద్యార్థినిలను లైంగికంగా వేధిస్తే కఠిన చర్యలు తప్పవు : ప్రకాశ్‌జాదవ్, జిల్లా ఎస్పీ
పాఠశాలలు,కళాశాలల్లోవి ద్యార్థినిల పట్ల ఉపాధ్యాయులు, తోటి వి ద్యార్థులు, ఆకతాయిలు అసభ్య ంగా ప్రవర్తిస్తే శిక్ష తప్పదు. లైంగికంగా వేధి ంచిన వారి పట్ల చట్టం కఠిన చర్యలు తీసుకుంటుం ది. శాఖాసంబంధిత నంబర్ 100కు స మాచారం అందిస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచు తాం. ఆకతాయిల భరతం పట్టాలంటే సమాచారం అందించడంలో విద్యార్థినిలు, మహిళలు వెనకడుగు వేయకూడదు.

Comments

comments