Search
Tuesday 19 June 2018
  • :
  • :

ప్రొస్టేట్‌గ్లాండ్‌కు ఆధునిక చికిత్స

పురుషుల పునరుత్పాదక వ్యవస్థలో అత్యధిక ప్రాధాన్యత గల ప్రొస్టేట్ గ్లాండ్ సమస్యలు ఇటీవల ఆందోళనలు సృష్టిస్తున్నాయి. 50 ఏళ్ళపైబడిన వారికి రావ ల్సిన సమస్య అన్ని వయస్సుల వారికి వస్తున్నట్లు వైద్యరంగ నిపుణులు గమనిం చారు. రోగనిర్ధారణ జరిగితే నివారణ తేలిక, మూత్రాశయాల్లో సంభవించే ఇబ్బందుల ప్రక్రియకు ప్రొస్టేట్ గ్లాండ్ సమస్యలు ఒక కారణంగా గుర్తించాల్సి ఉంటుంది. ప్రొస్టేట్ గ్లాండ్ (వస్థీ గ్రంథి) సమస్యలు, నివారణకు సంబంధించిన అంశాలపై కేర్ ఆసుపత్రుల కన్సల్టెంట్ యూరోలాజిస్ట్, ట్రాన్స్‌ప లెంట్ సర్జన్ డాక్టర్ పి. వంశీకృష్ణతో పల్స్ ఇంటర్వూ….

athrists

మానవశరీరంలో ఉన్న అనేక గ్రంథుల్లో ప్రొస్టేట్ గ్లాండ్ ప్రాధాన్యత ఏమిటి?
పురుషుల పునరుత్పాదక వ్యవస్థకు వ్యస్థిగ్రంథి ప్రాధాన్యత వహిస్తుంది. వీర్యంలో ఉండే ద్రవంను ఉత్పత్తి చేసే ఈ గ్రంథి సమస్యలను అనేక పరీక్షలద్వారా గుర్తించి ప్రాణాపాయం లేకుండా చికిత్స చేయవచ్చు. అయితే గ్రంథి సమస్యలు తీవ్రమైతే ప్రతికూల ప్రభావంతో పురుషుల్లో మూత్ర సమస్యలు ఉత్పన్నమవుతాయి.
ప్రమాదకరంగా వ్యవహరించే ఈ గ్రంథి పెరుగుదలను ఎలా గమనించవచ్చు?
గ్రంథి పెరుగుదల ప్రాణాపాయంగా ఉండదు. అయితే సమస్యలు తీవ్రమైతే ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. వైద్యశాస్త్రం మేరకు మధ్య వయసు దాటిన పురుషుల్లో ప్రొస్టేట్ పెద్దదవుతుంది. ఈ పెరుగుదలను ప్రాణాపాయ రహిత వస్థి గ్రంథి పెరుగుదల (బినైన్ ప్రొస్టేటిక్ పైపవర్‌ప్లాసియా)అంటారు. తరచుగా ఇది 50 ఏళ్ళు దాటిన పురుషుల్లో ఎదుగుతుంది. ఆయితే ఈ ఎదుగుదలను క్యాన్సర్ అనుకొని ఆందోళన పడవద్దు. ఇది మూత్రాశయానికి చుట్టుకుని ఉండటంతో మూత్ర విసర్జనకు ఆటంకం కలిగిస్తుంది. ఈ లక్షణాలను ముందుగా కనుక్కుంటే నివారణ తేలికవుతుంది. క్యాన్సర్ రహితంగా వృద్ధిచెందే ప్రొస్టేట్ గ్లాండ్ మూత్రనాళాన్ని ముడుచుకుపోయేలా వృద్ధి చెందుతుంది. బ్లేడర్ ఖాళీ కావడాన్ని నియంత్రించడంతో జరిగే ఒత్తిడి మూత్రాశయాల సమస్యలకు ప్రేరకాలు అయ్యే ప్రమాదం ఉంది.
గ్రంథి పెరుగుదల లక్షణాలు ఎలా ఉంటాయి?
ప్రొస్టేట్ గ్లాండ్ పెరుగుతుందనడానికి అనేక లక్షణాలు అగుపిస్తాయి, మూత్రం అనిశ్చితంగా ఆగి సన్నగా రావడం, లేదా మూత్రం తొందరగా రావడం, అత్యంత తరుచుగా రాత్రి సమయాల్లో మూత్రవిసర్జన ఉండటం వ్యాధి లక్షణాలు. అలాగే విసర్జన సమయంలో మంట లేదా నొప్పికూడా కలుగుతుంటుంది. విసర్జనలో ఒత్తిడి, కష్టపడటం ఉంటుంది. ఈ లక్షణాలన్నీ గ్రంథి పెరుగుదలతోనే వస్తుంటాయి. అయితే రోగనిర్దారణ పరీక్షల్లో వ్యాధి తీవ్రత బహిర్గతమవుతుంది.
ప్రత్యేక ఎలక్ట్రానిక్ మీటర్‌ను ఉపయోగించి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. మూత్ర విసర్జన వేగం తగ్గినట్లయితే అది బిపిహెచ్‌గా నిర్ధారించవచ్చు. అలాగే పోస్ట్ వాయిడ్ రెసిడ్యువల్ పరీక్ష ద్వారా బ్లేడర్ ఖాళీని గమనించవచ్చు.
మందులతో ప్రొస్టేట్ గ్రంథి పెరుగుదలను నియంత్రించవచ్చా?
ప్రొస్టేట్ పరిమాణాన్ని తగ్గించేందుకు ప్రత్యేక మందులు ఉన్నాయి. మందులతో మూత్రాశయంపై ఒత్తిడిని తగ్గించవచ్చు, ప్రొస్టేట్ వృద్ధిని ప్రోత్సహించే హార్మోన్లను అడ్డుకొని గ్రంథి పెరుగుదలను నివారించవచ్చు. అలాగే మూత్ర విసర్జన తీవ్రతకు ఉపశమనం కలిగించేందుకు మందులు ఉన్నాయి.
మందులతో నివారణ కానప్పుడు శస్త్రచికిత్స అవసరమవుతుందా?
గ్రంథిపెరుగుదల తీవ్రత తో పాటు మందులతో ఉపశమనం లేనప్పుడు అనేక శస్త్ర చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. సైటో స్కోపు ద్వారా గ్రంథి పరిమాణాన్ని వైద్యులు చూడవచ్చు. ట్రాన్స్‌యురిథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రొస్టేట్ పద్దతిలో మూత్రాశయం, బ్లేడర్‌ను అడ్డుకునే టిష్యూలను శస్త్రచికిత్సద్వారా తొలగించవచ్చు. అయితే టిష్యూ పరిమాణం అధికంగా ఉంటే పొత్తికడుపులో ఓపెన్ ప్రోస్టేటెక్టొబీ ఇన్సిషన్ చేయాల్సి ఉంటుంది. థర్మల్ థెరపీలతో అధిక టిష్యూలను కుంచించుకుపోయేలా చేయడానికి వీటిని వైద్యులు ఉపయోగిస్తారు. ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యులను సంప్రదించి వ్యాధి నివారణకు చికిత్స తీసుకోవాలి.గ్రంథి పెరుగుదలను అడ్డుకునే ఆధునిక వైద్యసదుపాయాలు అనేకం ఉన్నాయి. అయితే లక్షణాలను, ఇబ్బందులను దాచుకోకుండా వైద్యుల దృష్టికి తీసుకువస్తే నివారణ ఎంతో తేలిక. గ్రంథి పెరుగుదలతో ఆందోళన చెందాల్సిన అవసరంలేదు.
భూమేశ్వర్

Comments

comments