Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

భయ్యూజీ మహారాజ్ బలవన్మరణం…

Spiritual Leader Bhaiyyu Maharaj Commits Suicide in Indore

ఇండోర్: మధ్యప్రదేశ్‌కు చెందిన ఆధ్యాత్మిక వేత్త భయ్యూజీ మహారాజ్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆయనను హుటాహుటిన ఇండోర్‌లోని ముంబయి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు వెల్లడించారు. భయ్యూజీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు అత్యంత సన్నిహితుడు. ఆధ్యాత్మికవేత్తగా మహారాష్ట్రలో మంచి ఫాలోయింగ్ ఉన్న భయ్యూజీకి ఇటీవల నర్మదా నదీ ప్రక్షాళన బోర్డులో భాగంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించిన సంగతి తెలిసిందే. కాగా, మహారాజ్ బలవనర్మరణానికి పాల్పడాన్ని ఆయన అనుచరులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Comments

comments