Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

గర్భాలయ నిర్మాణానికి పూజలు

 Sri Lakshminarasimha Swami Temple Development

మనతెలంగాణ/యాదాద్రి : శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయ అభివృధ్ధి పనుల్లో భాగంగా కొండపైన గల శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి  శివాలయ గర్భాలయం నిర్మాణానికి పూజలు నిర్వహించారు. సోమవారం రోజున శివాలయ పునర్ అభివృద్ధి పనుల్ల్లో భాగంగా గర్భాలయ నిర్మాణానికి శంకుస్థాపన పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్తపతి వేలు, ఆలయ ఈఓ గీత, వైటిడిఎ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈఓ, స్తపతి, వైటిడిఎ అధికారులు నిర్ణిత కాల పరిమితిలో ప్రకారం శివాలయ నిర్మాణాన్ని, ముఖ్యంగా శివాలయ గర్భాలయ పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు.

Comments

comments