Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

ప్రత్యేక యంత్రాంగం

bs

మొండి బకాయిల పరిష్కారానికి 

ప్రభుత్వరంగ బ్యాంకులు ఏర్పాటు చేయాలి
మెహ్తా కమిటీ రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలి
పిఎస్‌బిలకు సర్కారు పూర్తి సహకారం
బ్యాంక్ చీఫ్‌లతో భేటీలో మంత్రి పియూష్

న్యూఢిల్లీ : మొండి బకాయిల పరిష్కారానికి బ్యాంకులు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి పియూష్ గోయల్ ఆదేశించారు. 21 ప్రభుత్వరంగ బ్యాంకులు అన్నింటికి కేంద్రం పూర్తి సహకారం అందించేందుకు కట్టుబడి ఉందని అన్నారు. శుక్రవారం ప్రభుత్వరంగ బ్యాంకు(పిఎస్‌బి)ల అధిపతులతో సమావేశమైన గోయల్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతానికి, వేగవంతంగా ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తుల) పరిష్కారానికి త్వరలో బ్యాంకులు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. మొండి బకాయిల పరిష్కారానికి ఎఆర్‌సి(అస్సెట్ రీస్ట్రక్చరింగ్ కంపెనీ) లేదా ఎఎంసి(అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ) ఏర్పాటుపై పిఎన్‌బి(పంజాబ్ నేషనల్ బ్యాంక్) నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సునీల్ మెహ్తా ఆధ్వర్యంలోని కమిటీ రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అరుణ్ జైట్లీ వైద్య చికిత్స పొందుతున్న కారణంగా పియుష్ గోయల్ ఆర్థికమంత్రిగా అదనపు బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తొలిసారి ఆర్థికమంత్రిగా నిర్వహించిన మీడియా సమావేశంలో గోయల్ మాట్లాడుతూ, వచ్చే 30 రోజుల్లో ఐదు ప్రభుత్వరంగ బ్యాంకుల ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులకు మరింత మూలధన నిధి వార్తలను ఆయన కొట్టిపారేశారు. ‘బ్యాంకులను పట్టిపీడిస్తున్న మొండి బకాయిల సమస్య పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని బ్యాంకులు ఏర్పాటు చేయాలి’ అని అన్నారు. 11 పెద్ద మొండి బకాయి ఖాతాల గురించి కేంద్ర విద్యుత్, ఆర్థిక మంత్రిత్వశాఖ త్వరలో చర్చించనుందని తెలిపారు. దేశీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి క్రెడిట్ ఫ్లో మెరుగుపరచడం, రిస్క్‌లను తగ్గించడంపై చర్తిస్తామని పిఎస్‌యు బ్యాంకుల చీఫ్‌లతో గోయల్ అన్నారు. మొండి బకాయిల వేగవంత పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేయాలని, దీనికి నిపుణుల సహాయం తీసుకోవాలని అన్నారు.

Comments

comments