Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

స్టాక్ మార్కెట్లలో అంతటా ఉత్సాహం

stock-exchange-done-in-pts

 సెన్సెక్స్ 35,178.88
 నిఫ్టీ 10,684.65 పాయింట్లకు..

ముంబయి: నాలుగేళ్ల తర్వాత భారత రిజర్వు బ్యాంకు కీలక వడ్డీ రేట్లను పెంచడంతో స్టాక్ మార్కెట్లలో ఊపొచ్చింది. గత మూడు రోజులుగా నష్టాలే చవిచూసిన బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజి(బిఎస్‌ఇ) సూచీ సెన్సెక్స్ బుధవారం దాదాపు 276 పాయింట్లు పెరిగింది. 201819 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు 7.4 శాతంను ఆర్‌బిఐ యథాతథంగా ఉంచడం వల్ల పెట్టుబడి, వినియోగం పెరిగే అవకాశాలున్నాయని స్టాక్ బ్రోకర్లు అన్నారు.  రూపాయి విలువ పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలత కారణంగా మదుపరుల సెంటిమెంట్‌కు మరింత బలం చేకూరిందని వారన్నారు. నాలుగున్నరేళ్ల తర్వాత తొలిసారి ఆర్‌బిఐ కీలక వడ్డీ రేట్లను పెంచింది. బిఎస్‌ఇ సెన్సెక్స్ 34,932. 49 పాయింట్లతో ఆరంభమైంది. తర్వాత పడిపోయింది. కానీ ఆర్‌బిఐ విధాన ప్రకటనతో మళ్లీ పుంజుకుని 35,230.54 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరికి 35,178.88 పాయిం ట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 0.79 శాతం లాభపడింది. సెనెక్స్ గత మూడు సెషన్లలో 419.17 పాయింట్లు నష్టపోయిందన్నది ఇక్కడ గమనార్హం. బిఎస్‌ఇ సెన్సెక్స్ బాటలోనే ఎన్‌ఎస్‌ఇ ని ఫ్టీ కూడా 10,698.35 నుంచి 10,587.50 పాయింట్ల మధ్య తచ్చాడి చివరికి 91.50 పా యింట్లు లేక 0.86 శాతం పెరిగి 10,684.65 వద్ద ముగిసింది. దేశీ సంస్థాగత మదుపరులు(డిఐఐ) నికరంగా రూ. 474.33 కోట్ల విలువచేసే షేర్లు కొన్నారు. కాగా విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరులు(ఎఫ్‌పిఐలు) మంగళవారం రూ. 157.51 కోట్ల విలువచేసే ఈక్విటీలు అమ్మారని ప్రావిజినల్ డాటా ద్వారా తెలుస్తోంది. మార్కెట్ కోరుకున్న విధంగానే వడ్డీ రేట్లు పెరిగాయి. జిడిపి 7.4 శాతంగా అంచనా వేయబడింది. టెలికామ్ స్టాకులు బాగా లాభపడ్డాయి. అన్ని రంగాల కన్నా  బిఎస్‌ఇ టెలికామ్ సూచీ బాగా పెరిగింది.  భారతి ఎయిర్‌టెల్ 4.55 శా తం పెరుగుదలతో  సెన్సెక్స్ గెయినర్స్ జాబితా లో టాప్‌లో నిలిచింది. లాభపడిన ఇతర కంపెనీల్లో టాటా మోటార్స్ 3.56 శాతం, సన్‌ఫార్మా 3.21 శాతం, కోల్ ఇండియా 1.98, బజాజ్ ఆటో 1.78 శాతం, విప్రో 1.57 శాతం..లాభపడ్డాయి. కాగా ఒఎన్‌జిసి, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ 0.47 శాతం నష్టపోయాయి. చక్కెర స్టాకు ధరలు మరింత ఎగబాకాయి. క్యాబినెట్ చక్కెర ఉత్పత్తి కంపెనీల రక్షణ ప్యాకేజి(బెయిలవుట్)ను ఆమోదించింది. బిఎస్‌ఇలో ఉత్తమ్ షుగర్స్ 1.54 శాతం, అవధ్ షుగర్స్ 0.53 శాతం, బజాజ్ హిందుస్థాన్ షుగర్ 0.71 శాతం లాభపడ్డాయి. అన్ని రంగాల సూచీలు నేడు పచ్చ రంగులోనే క్లోజ్ అయ్యాయి. ఆసియా ప్రాంతంలో జపాన్ స్టాక్ మార్కెట్ సూచీ  నిక్కీ 0.36 శాతం, షాంఘై కంపోజిట్ ఇండెక్స్ 0.05 శాతం, హాంకాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.52 శాతం పెరిగాయి. యూరోజోన్‌లో డిఎఎక్స్ 0.28 శాతం, పారిస్‌కు చెందిన సిఎసి 0.28 శాతం, లండన్‌కు చెందిన ఎఫ్‌టిఎస్‌ఇ 0.19 శాతం లాభపడ్డాయి.

Comments

comments