Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

రైతన్న కన్నెర్ర

Stop Distribute Passbooks To Farmers

మనతెలంగాణ/పెద్దేముల్ : గత 30సంవత్సరాల నుంచి తాము పంటలు పండించుకుంటూ, పట్టాదారు పాస్‌పుస్తకాలను సైతం పొందామని, ప్రస్తుతం తమకు రైతు బంధు పథకం వర్తించందంటూ, పట్టదారు పాసుపుస్తకాలను నిలిపివేతపై రైతులు కన్నేర్ర చేశారు.  అధికారుల తీరుకు నిరసనగా మంగళవారం వికారాబాద్ జిల్లా మండల కేంద్రమైన పెద్దేముల్ రైతులు తాండూరుసంగారెడ్డి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించి ఆందోళనకు దిగారు. మండల కేంద్రానికి చెందిన సుమారు 73మంది రైతులు 265ఎకరాల భూమి ఉంది. గత ముప్పై సంవత్సరాల క్రితమే  వారికి పట్టదారు పాసుపుస్తకాలు కల్గి ఉండడంతో పాటు పంటలు సైతం సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ భూమికి సంబంధించిన పట్టదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు మాత్రం ఆట్టి భూమిపై కోర్టులో కేసు నడుస్తున్నందున్న వారికి సంబంధించి పాసుపుస్తకాలతో పాటు రైతు బంధు చెక్కులను సైతం నిలిపివేసినట్లు తెలిపారు. ఇది గ్రహించిన రైతులు అగ్రహంతో రోడ్డు బైటాయించి ధర్నాకు దిగారు. భూములు కొనుగోలు చేసి తాము 30ఏళ్లుగా సాగు చేసుకుంటున్న  భూములకు  పట్టాలివ్వడం లేదని రైతులు ఆగ్రహించారు. తహసీల్దార్  వచ్చి సమాధానమిచ్చే వరకు మేము ఆందోళన విరమించేది లేదంటూ ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనతో తాండూరుసంగారెడ్డి రోడ్డుపై సుమారు రెండు గంటల పాటు వాహనాలు స్తంభించి పోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకి వచ్చి నచ్చచెప్పిన వినలేదు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకోని కూర్చోన్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ తులసిరామ్ అక్కడి చేరుకుని ఈ భూములకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తున్నందున్న తాము పాసుబుక్‌లను అందించలేమని, అట్టి విషయంలో తాము ఏమి చేయలేకపోయామంటూ తేల్చి చెప్పారు. ఏదైన ఉంటే మీరు కోర్టులో తేల్చుకోవాలని సూచించారు. దీంతో రైతులు ధర్నాను విరమించారు.

Comments

comments