Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

ఆహార భద్రత పటిష్టానికి చర్యలు

 Subsidy Scheme of Residencial Schools and Hostels

మన తెలంగాణ/ వరంగల్ అర్బన్ జిల్లా ప్రతినిధి :  భారత ఆహార భద్రతాచట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లాలో అధికార యంత్రాంగం ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతోంది. గురువారం జిల్లా స్థాయి ఆహార భద్రత కమిటీ సమావేశాన్ని కలెక్టర్ సమావేశం మందిరంలో నిర్వహించారు. తెలంగాణ ఆహార భద్రతా చట్టం కమిషన్ సభ్యులు బానోతు సంగిలాల్ హాజరై పలు అంశాలను సమీక్షించారు. జిల్లాలో మరింత పకడ్బందీగా అమలు జరిగేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. చట్టాన్ని క్షేత్రస్థాయిలో సజావుగా అమలు జరుగుతున్న తీరుతెన్నులను సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఆకలిచావులను, వలసలను ఆపేందుకు గ్రామ స్థాయి మొదలుకొని పట్టణం వరకూ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేస్తున్న విషయం విదితమే. జిల్లా స్థాయిలో డిజిఆర్‌ఓ కమిటీ ఏర్పాటు చేసి నోడల్ అధికారులుగా జిల్లా వెల్ఫేర్ అధికారి, జిల్లా సివిల్ సఫ్లై అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారితో పాటు విజిలెన్స్ కమిటీ , గ్రామ స్థాయి కమిటీల భాగస్వామ్యంతో పూర్తి స్థాయిలో ప్రజలకు రేషన్‌షాపుల ద్వారా ఒక్కొక్కరికీ ఆరు కిలోల చొప్పున బియ్యం అదించడం జరుగుతుంది. అయితే క్షేత్ర స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణల నేపథ్యంలో అక్రమాలకు చెక్ పెట్టే విధంగా ఇప్పటికే ప్రభుత్వం తగు చర్య లు చేపట్టింది.

గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో సన్నబియ్యం పథకం ప్రారంభించడం తో పాటు అన్నపూర్ణ పథకం ద్వారా నిరుపేదలకు రూ.5 కే భోజనం అందిస్తుండటం గమనార్హం. అయితే ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా చట్ట ప్రకారం పథకం అ మలు జరుగుతున్న తీరును జిల్లా సివిల్ సఫ్లై అధికారి ఆహార భద్రత పటిష్టానికి చర్య లు అమలు తీరును సమీక్షించిన అధికారి విజయలక్ష్మి సమావేశంలో వివరించారు. జిల్లాలో 2లక్షల 44వేల 470 రేషన్ కార్డులు,12వేల 954 అంత్యోదయ కార్డులు, 276 రేషన్ షాపుల ద్వారా ప్రతినెల 235 మెట్రిక్ టన్నుల దాన్యాన్ని అందించడం జరగుతుందని వివరించారు. జిల్లాలోని రెండు ఎంఎల్‌ఎస్ పాయింట్ల ద్వారా బియ్యం సరఫరా చేయడం జరుగుతుందని, ఎలాంటి అపోహాలకు తావివ్వకుండా ప్రతి ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.రవాణా చేసే వాహనాలకు జిపిఎస్ ఏర్పాటు చేసి కమెండింగ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అనునిత్యం పన్యవేక్షించడ ం జరుగుతుందన్నారు. 516 పాఠశాలలకు గాను 9.86 మెట్రిక్ టన్నుల సన్న బియ్యా న్ని నేరుగా ఎంఎల్‌ఎస్ పాయింట్ల ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో నూతనం గా రేషన్‌కార్డుల కోసం 11వందల ధరఖాస్తులు వచ్చాయని, వీటిని పరిశీలిస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా వెల్ఫేర్ అధికారి, జిల్లా ఉప విద్యాశాఖధికారి, విజిలెన్స్ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రేషన్ డీలర్లు పాల్గొన్నారు.

Comments

comments