Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

15న బైబ్యాక్‌పై టిసిఎస్ బోర్డు భేటీ

Tata Consultancy Services shares by back

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ దిగ్గజం టిసిఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) షేర్ల బైబ్యాక్(సొంత షేర్ల కొనుగోలు)ను పరిశీలిస్తోంది. రేపు(జూన్ 15న ) కంపెనీ బోర్డు సమావేశం కానుందని, ఈ భేటీలో డైరెక్టర్లు బైబ్యాక్ ప్రతిపాదనపై చర్చించనున్నారని ఈమేరకు బిఎస్‌ఇ ఫైలింగ్‌లో టిసిఎస్ వెల్లడించింది. అయితే కంపెనీ షేర్ల బైబ్యాక్ గురించి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ఇదే విషయమైన 2018 క్యూ4(జనవరిమార్చి) సందర్భంగా టిసిఎస్ సిఇఒ రాజేష్ గోపీనాథన్ సంకేతాలిచ్చారు. గతేడాదిలో రూ.16 వేల కోట్ల మెగా బైబ్యాక్ ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది.  ఏంజిల్ బ్రోకింగ్ ఫండ్ మేనేజర్ మౌరేష్ జోషి మాట్లాడుతూ, కంపెనీ మిగులు నగదు నిల్వలను డివిడెండ్ రూపంలో కానీ, బైబ్యాక్ ద్వారా కానీ వాటాదారులకు అందించాలని భావిస్తోందని, బైబ్యాక్ వల్ల రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ (ఆర్‌ఒఇ) మెరుగుపడుతుందని అన్నారు. దీర్ఘకాల పెట్టుబడి లక్ష్యంతో టిసిఎస్ షేరుతో మంచి రాబడిని పొందవచ్చని అన్నారు. డివిడెండ్ రూపంలో ఇవ్వడం ద్వారా పన్ను భారం ఎక్కువగా ఉండడం వల్ల బైబ్యాక్ మార్గంలో పన్ను తగ్గించుకుంటూ కంపెనీ యాజమాన్యం ప్రయోజనం పొందుతుందని నిపుణులు అంటున్నారు. ఈ ఏడాదిలో టిసిఎస్ రూ.27,000 కోట్ల మిగులు నగదు నిల్వలను ప్రకటించే అవకాశం ఉండగా, ఇందులో రూ.18,000 కోట్లను బైబ్యాక్ కోసం కేటాయించే అవకాశం ఉందని, మిగిలిన రూ.10,000 కోట్లను డివిడెండ్ కోసం ఉపయోగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. బైబ్యాక్ వార్తల నేపథ్యంలో బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో టిసిఎస్ షేరు 2.41 శాతం లాభపడి రూ.1,824 వద్ద ముగిసింది.

Comments

comments