Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపిని బలోపేతం చేస్తాం…

TDP will be strengthened in the local bodies election

వనపర్తి రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపిని బలోపేతం చేయాలని టిడిపి జిల్లా అధ్యక్షులు బి.రాములు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వనపర్తి పట్టణ కేంద్రంలో టిడిపి పార్టీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా టిడిపి నాయకుల ఆధ్వర్యంలో మాజి ఎంఎల్‌ఎ రావుల చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి జిల్లా అధ్యక్షులు బి.రాములు మాట్లాడుతూ. స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి బలోపేతానికి కృషి చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా జీవితంలో ఇంకాఎన్నోవిజయాలను సాధించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వేడుకల్లో టిడిసి సీనియర్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్, రమేష్ చందర్, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఫోటోరైటప్ 28ః కేక్ కట్‌చేసి రావుల జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న టిడిపి నాయకులు

Comments

comments