Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Telangana Formation day celebrations
కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయలో, పాఠశాలల్లో, వివిధ పార్టీల కార్యాలయాలలో శనివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన ఎమ్మెల్యే కె. విద్యాసాగర్‌రావు టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు 14 సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణను, బంగారు తెలంగాణగా మర్చడమే లక్ష్యంగా కెసిఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చీటి వెంకట్రావు, మున్సిపల్ చైర్మన్ శీలం వేణుగోపాల్, మార్కెట్ కమిటి చైర్మన్ సింగిరెడ్డి, నారాయణరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులు డా॥ అనూప్‌రావు, పుప్పాల ప్రభాకర్‌లు పాల్గొన్నారు.

మున్సిపల్ కార్యాలయం
స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ శీలం వేణుగోపాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తడి-పొడి చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వాణిరెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

మర్కెట్ కమిటి ఆవరణం
కోరుట్ల మార్కెట్ కమిటి ఆవరణంలో మార్కెట్ కమిటి చైర్మన్ సింగిరెడ్డి నారాయణరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మార్కెట్‌లో ఏర్పాటు చేసిన ఎడ్ల బండి విగ్రహంను ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చీటి వెంకట్రావు, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ అన్నం అనిల్, డైరెక్టర్లు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టి కార్యాలయం:
స్థానిక కాంగ్రెస్ పార్టి కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏఆర్ అక్బర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సోనియగాంధీ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి, స్వీట్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజి కౌన్సిలర్ సోగ్రాభి, మండల కాంగెస్ అధ్యక్షులు పుదరి నర్సయ్య, నాయకులు రసమల్ల రాజు, కయ్యుమ్, పవన్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments