Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

శ్రీవారిని దర్శించుకున్న తలసాని

Telangana Minister Talasani Visit the Tirumala

తిరుమల : తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సోమవారం దర్శించుకున్నారు. సోమవారం మధ్యాహ్నం కల్యాణోత్సవ విరామ సమయంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం వేదపండితులు ఆయనకు రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం, శ్రీవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించారు. శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తలసాని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్టు ఆయన తెలిపారు.

Telangana Minister Talasani Visit the Tirumala

Comments

comments