Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

Telangana state formation day Celebrations

వలిగొండః వలిగొండ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాలల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా శనివారం నిర్వహించారు,మండల కేంద్రంలోని ఎంపిడీవో కార్యాలయం ముందు ఎంపిపి శ్రీరాముల నాగరాజు తెలంగాణ తల్లి చిత్ర పటానికి పూల మాలను సమర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు,తహశీల్దార్ కార్యాలయం ముందు తహశీల్దార్ బి.యాదయ్య,వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ముందు చైర్మన్ మారగోని జంగాల్ గౌడ్,స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు సర్పంచ్ పబ్బు ఉపెందర్‌బోస్,ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ముందు డాక్టర్ సుమన్ కళ్యాణ్,ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలల్లో జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ ఆవిర్బావ వేడుకలను ఘనంగా నిర్వాహించారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి మొగుళ్ళ శ్రీనివాస్,మత్సగిరి గుట్ట చైర్మన్ తుమ్మల వెంకట్‌రెడ్డి,వైస్ ఎంపిపి కుంభం వెంకట్‌పాపిరెడ్డి,ఎంపిడీవో విజయ నాయక్,పిఆర్‌ఏఈ ఇంద్రసేనారెడ్డి,డిప్యూటీ తహశీల్దార్ రామానూజచార్యులు,తదితరులు పాల్గొన్నారు.
వలిగొండ గ్రామాపంచాయతీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంః మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా శనివారం నిర్వహించారు.సర్పంచ్ పబ్బు ఉపేందర్‌బోస్ జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం గ్రామ పంచాయతీ కార్మికులు 26 మందికి దుస్తులు,సబ్బులు,నూనెలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి కుంభం వెంకట్‌పాపిరెడ్డి,ఎంపిటీసీ ఐయిటిపాముల జ్యోతి సత్యనారాయణ,కార్యదర్శి ఎం.నాగరాజు,ఉపసర్పంచ్ శీలోజు కలమ్మ శ్రీరాములు,పోలేపాక భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
గాయత్రి స్కూల్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలుః మండల కేంద్రంలోని గాయత్రి ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా శనివారం ఘనంగా నిర్వహించారు.తెలంగాణ తల్లి చిత్రపటానికి పూల మాలను సమర్పించి జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం విద్యార్ధులచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆంటోని లోఫేజ్,చైర్మన్ తవుటం నరహరి,పనుమటి మురళీధర్‌రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Comments

comments