Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం

Telangana state number one in corruption

మనతెలంగాణ/నిజామాబాద్ సిటీ: అవినీతిలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ అని, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల ఆకాంక్షలను నేరవేర్చడంలో కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల ఆకాంక్షలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో సగానికి పైగా ఉద్యమ ద్రోహులు ఉన్నారని, స్పీకర్ దగ్గర పెండింగ్‌లో ఉన్న ఎమ్మెల్యేల ఫిరాయింపులను అమలు చేయకుండా, అధికారాన్ని దుర్వినియోగం చేయడంలో, అవినీతిలో తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉందని విమర్శించారు. రైతుబంధు పథకం ద్వారా బడా భూస్వాములే లాభపడ్డారని, పేద రైతులకు ఎంత మాత్రం లాభం చేకూరలేదన్నారు. ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలు పర్పచడంలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో  ఉద్యమ ఎజెండాను అమలు చేయకుండా సొంత ఎజెండాను అమలు చేసే విధంగా కెసిఆర్ తన కుటుంబ సభ్యులతో పాలనను కొనసాగిస్తున్నారని విమర్శించారు. భూ రికార్డుల ప్రక్షాళన మొత్తం తప్పుల తడకగా ఉందని, 40 శాతానికి పైగా రికార్డుల్లో తప్పులు జరిగాయని తెలిపారు. ఇండ్లు లేని పేదవారికి డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి, 9 ఎకరాల్లో ప్రగతి భవన్ కట్టుకొని రాష్ట్ర ప్రజలను మోసం చేశారని అన్నారు.

ప్రజలందరూ డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి, 9 ఎకరాల్లో ప్రగతిభవన్ కట్టుకొని రాష్ట్ర ప్రజలను మోసం చేశారని అన్నారు. ప్రజలందరూ డబుల్ బెడ్‌రూం ఇండ్ల కోసం ప్రగతిభవన్‌ని ముట్టడించాలని పిలుపునిచ్చారు. కేజి నుండి పిజి వరకు ఉచిత విద్య అమలు చేస్తామని చెప్పి, భూమి ఇవ్వకుండా దళిత గిరిజనులను మోసం చేశారన్నారు. గొర్రెల, చేపల పంపిణీలో ప్రభుత్వం అవినీతి బయటపడిందని, పథకాలను ప్రచారం కోసమే తప్ప ప్రజల అభివృద్ధ్ది కోసం అమలు చేయడం లేదన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం జిఎస్టీ పేరుతో దేశ ప్రజలపై 60 శాతం పైగా పన్నులను వసూలు చేస్తూ సామాన్య ప్రజలు బతుకులకు అప్పుల పాలు చేస్తూ, ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుందని, రాష్ట్ర పాలన తీరుపై మండిపడ్డారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో లక్షా యాబై వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.  ప్రధాన మంత్రి మోడీ నాలుగేళ్ల పాలనపై ఆగస్టు 1 నుండి 5వ తేదీ వరకు పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తామని తెలుపుతూ, సెప్టెంబర్‌లో బిజెపికి వ్యతిరేకంగా బిజెపి హటావో దేశ్ బచావో అని నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. పెట్రోల్, డిజీల్ గ్యాస్ సిలిండర్ల ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 20న దేశవ్యాప్తంగా నిరసన,దిష్టిబొమ్మ దగ్ధం వంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణలో రాజకీయ ప్రత్యామ్నాయ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.  ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు పద్మ, సిపిఐ జిల్లా అధ్యక్షులు కంజర్ల భూమయ్య, జిల్లా నాయకులు ఒమయ్య, రామ్ నరసింహరావు, పి. సుధాకర్, బోసుబాబు, స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments