Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

అఫ్గాన్ సైనిక శిబిరాలపై ఉగ్ర పంజా…

terrorist

కుందుజ్: అఫ్గానిస్తాన్‌లో సైనిక శిబిరాలను లక్షంగా చేసుకొని మరోసారి తాలిబన్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు.శనివారం కుందుజ్ ప్రావిన్స్‌లోని ఖలే జల్ జిల్లాలో సైనిక శిబిరంలోకి తాలిబన్ ఉగ్రవాదులు చొచ్చుకొచ్చి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 19 మంది సైనికులు మృతిచెంగా, కొందరు పోలీసులు కూడా గాయపడినట్లు ప్రావిన్స్ గవర్నర్ కార్యాలయం వెల్లడించింది. ఉగ్రవాదులపై సైనికులు ఎదురుకాల్పులు జరపగా 8 మంది ముష్కరులు మృతిచెందినట్లు తెలిపింది. శుక్రవారం కూడా హెరత్ ప్రావిన్స్‌లోని మిలిటరీ బేస్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో 17 మంది అఫ్గాన్ సైనికులు దుర్మరణం చెందారు.

Comments

comments