Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

100 శాతం వాటాలు అమ్మేద్దాం

air

ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణపై కేంద్రం మరో ప్రయత్నం
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎయిర్ ఇండియాతో ప్రైవేటీకరణను ప్రారంభించాలనుకున్నా.. అది ఫ్లాప్ షోగా మిగిలిపోయింది. రుణాల ఊబిలో కూరుపోయిన ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఎయిర్ ఇండియా వాటాల విక్రయం గడువు మే 31తో ముగిసింది. ఇప్పుడు సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థను ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. అయితే మరోసారి ప్రయత్నం చేయాలనే ఆలోచనకు వచ్చిన ప్రభుత్వం.. ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటాలను విక్రయించేందుకు సిద్ధమవుతోందని సమాచారం. ఇంతకుముందు ఎయిర్ ఇండియా విక్రయానికి సంబంధించిన నిబంధనల పట్ల పలు ప్రైవేటు సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ కారణంగానే బిడ్డింగ్ దూరంగా ఉన్నాయి. దీంతో నిబంధనల్లోనూ మార్పులు తీసుకురావాలని, 100 శాతం వాటాల విక్రయానికైనా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోందని ఈమేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలో సీనియర్ అధికారి సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేవారు లేకపోవడంతో కొత్త వ్యూహంతో రానున్నామని అన్నారు. ప్రభుత్వం వద్ద 24 శాతం వాటా ఉండాలనే స్థిరమైన నిర్ణయమేదీ లేదని, దీనిని పునర్‌పరిశీలించనున్నామని అన్నారు. ఎయిర్ ఇండియాకు దాదాపు 50 వేల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి. ప్రస్తుతం పన్ను చెల్లింపుదారుల నిధులతో సంస్థను నడిపిస్తున్నారు.

Comments

comments