Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

దంపతుల ఆత్మహత్య

The couple committed suicide by hanging separately

నారాయణపేట: పట్టణానికి చెందిన దంపతులు వేరు వేరుగా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై భావనయ్య కథనం మేరకు… పట్టణంలోని సుభాష్ రోడ్డులో నివాసం ఉంటున్న శృతి(20), రఘు(24)లు గత 3 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు నిత్యం మేకలను మేపడానికి పొలానికి వెళ్ళేవారు. ఈ క్రమంలో ఆదివారం మేకలను తీసుకొని ఇంటి నుండి బయలు దేరారు. సాయంత్రం మేకలు ఇంటికి వచ్చిన శృతి, రఘులు రాలేదు. కుటుంబ సభ్యులు వేతికిన ప్రయోజనం లేకపోయింది. అయితే సోమవారం ఉదయం పట్టణ శివారులో అదే వీధికి చెందిన ఓ వ్యక్తి శృతి చెట్టుకు వ్రేలాడుతూ కనబడడాన్ని గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని ఆ ప్రాంతం చుట్టు ప్రక్కల వేతకగా కొంత దూరంలో రఘు చెట్టు క్రింద పడి ఉండడాన్ని గమనించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. మృతురాలి తండ్రి గోవిందు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్ని  దర్యాప్తు చెపడుతున్నట్టు ఎస్సై భావనయ్య తెలిపారు.

Comments

comments