Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

తప్పిన ప్రమాదం

the-danger-of-failure-in-the-mountainous-terrain

విరిగి పడిన కొండ చరియలు తప్పిన ప్రమాదం

గంటల తరబడి నిలిచి పోయిన వాహనాలు
పాతాళ గంగ సమీపంలో ఘనట, ఇబ్బందులు పడ్డ భక్తులు

మనతెలంగాణ/అచ్చంపేట: శనివారం తెల్లవారు జామున కురిసిన వర్షానికి అమ్రాబాద్ మండలంలోని శ్రీశై లం డ్యాం సమీపంలో శనివారం ఉదయం కొండ చరియలు విరిగి పడ్డాయి, ఆ సమయంలో ఇరువైపుల నుండి ఎలాంటి వాహనాలు రాక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్-… శ్రీశైలం ప్రధాన రహదారి పాతాళ గంగ సమీపంలోని శ్రీశైలం బ్యారేజి వద్ద సంఘంటన జరిగింది. కొండ చరియలు విరిగి రోడ్డుపై పడడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. దాదాపు రెండె గంటల పాటు శ్రీశైలం, హైదరాబాద్ రహదారిలో ఇరువైపులా వాహనాలు కిలో మీటర్ల మేర నిలిచి పోయాయి. స్పందించిన స్థానిక పోలీసులు, అధికారులు జేసీబీల సహాయంతో రోడ్డుపై పడిన కొండ చరియలను తొలగించారు. దాదాపు రెండు గంటల పాటు రోడ్డుపై నే వాహనాలు నిలిచి పోవడంతో సుదూర ప్రాంతాల నుండి శ్రీశైలం వెళ్లి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఏది ఏమైనా కొండ చరియలు విరిగి పడిన ఘటనలో ఎవరికి ఎలాంటి అపాయం జరగక పోవడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.

Comments

comments