Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

విద్యార్థిపై ప్రభుత్వ ఉపాధ్యాయుని దాష్టీకం

The devastating punishment on the student

విద్యార్థిపై పైశాచిక దండన
కనీస నిబంధనలు పాటించని వైనం
ప్రభుత్వ పాఠశాలల్లో కనీవివి ఎరుగని పరిస్థితి
అపస్మారక స్థితిలో విద్యార్థి

మన తెలంగాణ/కొత్తగూడెం : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బడిబాట కార్యక్రమం ముగిసిన మూడు రోజుల్లోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లి మండలం ప్రశాంతినగర్ పాఠశాలలో అభం శుభం ఎరుగని విద్యార్థిని ఆ పాఠశాల ఉపాధ్యాయుడు పైశాచికంగా దండించిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాలను పరిశీలిస్తే లక్ష్మిదేవిపల్లి మండలంలోని ప్రశాంతినగర్‌కు చెందిన ఎస్‌కె నబిఅష్రఫ్ స్థానిక ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు.  స్కూల్ ప్రారంభం నాటి నుంచి నేటి వరకు క్రమం తప్పకుండా స్కూల్‌కు వెళ్తున్న ఎస్‌కె.నబిఅష్రఫ్‌ను పాఠశాల ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో అపస్మారక స్థితిలో చేరుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు విచారించగా పాఠశాలలో ఉపాధ్యాయుడు తనను దండించినట్లు తెలిపాడు.

Comments

comments