Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

రాజ్‌కుంద్రను ప్రశ్నించిన ఇడి

shilpa

రూ. 2000 కోట్ల బిట్‌కాయిన్ల మోసం కేసు దర్యాప్తు
ముంబయి: బిట్‌కాయిన్ లావాదేవీల కేసులో అక్రమ నగదు చలామణికి సంబంధించి నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రను మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించినట్లు అధికారులు తెలిపారు. వ్యాపారవేత్త అయిన రాజ్‌కుంద్రను ఇడి ఆఫీసుకు పిలిపించి బిట్‌కాయిన ట్రేడింగ్ గురించి ప్రశ్నించారని వారన్నారు. లావాదేవీలకు సంబంధించి కొన్ని కుంద్రకు భాగం ఉన్న ఘటనలున్నాయని..అందుకే అతడి స్టేట్‌మెంట్ తీసుకోడానికి ప్రశ్నించారని సమాచారం. బిట్‌కాయిన్ ట్రేడింగ్‌ను ప్రభుత్వం చట్టవ్యతిరేకమైనదిగా ప్రకటించింది. ఇడి కొంత కాలం కిందట అక్రమ నగదు చలామణిని నిరోధ చట్టం కింద బిట్‌కాయిన ఆధారిత పెట్టుబడి వెబ్‌సైట్ ‘గెయిన్ బిట్‌కాయిన్’ వ్యవస్థాపకుడు అమిత్ భరద్వాజ్, ఎనిమిది మంది ఇతరులపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. బిట్‌కాయిన్ లావాదేవీల్లో దాదాపు 8000 మంది మదుపరులు రూ. 2000కోట్ల నిధులను కోల్పోయారని ఇడి ఆరోపించింది. ఈ కేసులో మహారాష్ట్ర పోలీసుల ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఇడి కేసును దాఖలు చేసింది. కాగా పుణె పోలీసులు భరద్వాజ్, అతడి సోదరుడు వివేక్‌ను ఇదివరకే ఢిల్లీలో అరెస్టు చేశారు. గెయిన్ బిట్‌కాయిన్, జిబిమైనర్స్, ఎంసిఎపి, జిబి 21వెంచర్ల వెనుక భరద్వాజ్ ఉన్నారు. కాగా ఈ పోర్లళ్ల ద్వారా మదుపరులను మోసగించారని ఆరోపణ. భరద్వాజ్, అతడి సహచరులు ముంబయి, పుణె, నాందేడ్, కొల్హాపూర్, ఇతర ప్రాంతాల్లో మదుపరులను రూ. 2,000 వరకు ముంచారని సమాచారం. భారత్‌లో బిట్‌కాయిన్ వంటి వరువల్ కరెన్సీకి ఎలాంటి నియమాలు లేదవని, ఆ కరెన్సీలో లావాదేవీలు నిర్వహించడానికి ఏ సంస్థ/కంపెనీకి ఆర్‌బిఐ లైసెన్సులు ఇవ్వలేదని గత ఏడాది ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటుకు తెలిపారు. కాగా ప్రభుత్వం కూడా బిట్‌కాయిన్ వంటి వర్చువల్ కరెన్సీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని మదుపరులను హెచ్చరించింది. ఆ లావాదేవీలు పోంజీ పథకాల వంటివేనని, వాటికి రక్షణ, చట్టబద్ధత లేవని పేర్కొంది.

Comments

comments