Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

అలజడి

 The final list of voters by June 8

జూన్ 8 నాటికి ఓటర్ల తుది జాబితా

అన్ రిజర్వుడు స్థానాల్లో 50 శాతం మహిళలకు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 844 గ్రామపంచాయతీలు
 ఎస్‌సి, ఎస్‌టిలకు జనాభా ప్రాతిపదికన, బిసిలకు ఓటర్ల జాబితా ప్రకారం రిజర్వేషన్లు

మన తెలంగాణ/ నల్లగొండ ప్రతినిధి: గ్రామపంచాయతీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్నకొద్దీ సర్పంచ్‌గా పోటీ చేయదల్చుకున్న అభ్యర్ధుల్లో దడ మొదలయ్యింది. రేపో, మాపో పంచాయతీలకు రిజ ర్వేషన్లు ఖరారు చేయను న్నందున ఆశావహుల్లో అలజడి మొదలయింది. జులై చివరి నాటికి పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసి ఆగస్టు నాటికి కొత్త సర్పంచ్‌లు కొలువు తీరేలా ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల బరిలోకి దిగేందుకు అన్ని విధాల సంసిద్దులైన ఉత్సాహవంతులు రిజర్వేషన్ల ప్రకటనకై ఎదురు చూస్తున్నారు. సర్పంచ్ స్థానాల రిజర్వేషన్‌లను జిల్లా స్థాయిలో, వార్డు మెంబ ర్‌ల రిజర్వే షన్‌లను మండల స్థాయిలో ప్రటించ నున్నారు. మండల స్థాయిలో చేసిన రిజర్వేషన్‌లు డివిజన్ లెవల్‌కు, డివిజన్ స్థాయిలోనివి జిల్లా లెవల్‌కు సరిచూడాల్సివుంది. జూన్ 10 నాటికి రిజర్వే షన్‌లను ఖరారు చేసేందుకు అధి కారులు చర్యలు చేపట్టారు.  జూన్ 5 నుంచి జిల్లాలో 19 మండలాల్లో ఫోటో ఓటర్ల జాబితా సవరణను  చేపట్టారు. 6 వరకు గ్రామీణ అసెంబ్లీ ఓటర్ల జాబితా లో వార్డు, పంచాయితీ ఓటర్ల జాబితా లో చేర్పులపై సవరణకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. జూన్ 7న జిల్లా పంచా యతీ అధికారి అభ్యంతరాలు పరిష్కరించి, ఫోటో ఓటర్ల జాబితా మార్పులు చేసి జూన్ 8న గ్రామపంచాయతీ ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. నల్లగొండ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 844 గ్రామ పంచాయతీలు న్నాయి. వాటిలో 27 శాతం బీసీలకు, 15 శాతం ఎస్సీ, 9 శాతం ఎస్టీలకు కేటాయి స్తారు. మిగిలిన అన్ రిజర్వుడు స్థానాల్లో 50 శాతం మహి ళలకు కేటాయించ డం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన, బీసీలకు ఓటర్ల జాబితా ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. తమ తమ గ్రామ పంచా యతీ ల్లో గత రిజర్వేషన్‌ను బట్టి ఈ సారి తమ సామాజిక వర్గానికే దక్కు తుందని ఆశావహులు ఊహగానాలు చేస్తున్నారు. నూతన గ్రామపంచా యతీ ల్లో అధిక శాతం ఏకగ్రీవం చేసుకోవాలని, దాని ద్వారా ప్రభుత్వం ప్రకటించే నజరా నాతో పంచాయతీలను అభివృద్ధి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నప్ప టికీ రాజకీయ పార్టీల అభ్యర్ధులు పోటీకే మొగ్గుచూపుతున్నారు.

Comments

comments