Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

నాటిన మొక్కలను సంరక్షిద్దాం

 The fourth installment is a green program

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : నాలుగవ విడత హరితహార కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేద్దామని జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డి అధికారులను సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నాలుగవ విడత హరితహార కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. గత ఏడాది జిల్లాలో 1000 కిలోమీటర్ల ఎవెన్యూ ప్లాంటేషన్ 100 శాతం విజయవంతం అయ్యిందన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో మొక్కలు నాటి వాటిని సంరక్షించుకున్నాం అన్నారు. ఇదే స్పూర్తితో 20182019  సంవత్సరాల్లో సైతం జిల్లా వ్యాప్తంగా నాటిన మొక్కలను సంరక్షించుకొని ఆదర్శంగా నిలుద్దామన్నారు. అటవీ శాఖ భూముల్లో హరిత వనాల ద్వారా 1.53 కోట్ల మొక్కలు నాటడమో లక్షంగా పెట్టుకుందామన్నారు.జూన్ మొదటి రెండవ వారంలో వర్షాలు కురవగానె మొక్కలు నాటే కార్యక్రమాన్ని చెపడుతామన్నారు.మోక్కలు నాటే ప్రకియ జూన్ నెలాఖరు లోపు పూర్తి చేయాలని సూచించారు.మండలాల వారిగా మొత్తం లకాన్ని సంబందించి ఈ నెల 7 వతేది వరకు సంబందిత ఎపిఒ లు ప్రతిపాదనలు పంపాలన్నారు.

నాలుగవ విడత హరిత హరంలో 1.16కోట్ల మొక్కలను చెరువు గట్ల పై నాటే విదంగా చర్యలు తీసుకుంటున్నట్తు తెలిపారు.అన్ని శాఖల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా నాటిన మోక్కలను 100 శాతం సంరంక్షించుకునె విదంగా ముందుకు సాగుతునామన్నారు.అటవి శాక స్ధలంలో చెపట్టిన కందకాల వద్ద మూడు వరుసలుగా మొక్కలు పెట్టె అవకాశం ఉందని జిల్లా వ్యాప్తంగా 285 కిమి మెరా కందకాలను తీయడం జరిగిందన్నారు.గత ఎడాదిలో నాటిన ఎవేన్యూ ప్లాంటేషన్‌లలో ఎక్కడైన మొక్కలు ఎండిపోతే  వాటి స్ధలంలో నూతన మోక్కలను నాటాలన్నారు.ప్రతి మొక్కకు 20 గ్రాముల చోప్పున డిపిఎ ఎరువులను వేయాలన్నారు.చింత మడకలో గత ఎడాది నాటిన మొక్కలు 80 శాతం సంరక్షించడంతో కలెక్టర్ హర్షం వ్యక్తం చేస్తు ఎంపిడిఒ సమ్మిరెడ్డి,ఎపిఒ నిర్పింగరావు ను ఆయన అబినందించారు.గత ఎడాది హరిత హరం కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి సహకరించిన ప్రజా ప్రతినిదులకు,అదికారులకు హరిత సైనికులకు ఆయన కృతజ్జతలు తెలిపారు.సమీక్ష సమావెశంలో జాయింట్ కలెక్టర్ పద్మాకర్,అటవి శాఖ అదికారి శ్రీదర్ రావు,డిపిఒ సురేష్‌బాబు,డిఆర్డిఎ అదికారి స్వామిగౌడ్ ,మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి,వివిద శాఖల అదికారులు రామలక్ష్మి,తదితరులు పాల్గోన్నారు. కాగా  ప్రపంచ పర్యవరణ దినోత్సవ సందర్బంగా జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి జిల్లా అదికారులతో పర్యవరణ పరిరక్షణ పై ప్రతిజ్జ చేయించారు.అనంతరం అదికారులు కలెక్టర్‌కు మొక్కలు అందజెశారు.

Comments

comments