Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

ప్రజా సంక్షేమమే ధ్యేయం

The goal is public welfare

మనతెలంగాణ/ సుల్తానాబాద్: తెలంగాణ ప్రజానీక సంక్షేమమే ధ్యేయంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తునందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. మండలం పరిధిలోని ఐత్ర్రాజ్‌పల్లి గ్రామంలో శాలకుంట మిషన్‌కాకతీయ పథకం కింద రూ.27లక్షలతో చేపట్టే పూడిక తీత పనులను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే రూ.17లక్షలతో చేపట్టే సర్వాల కుంట పూడిక తీత పనులను ప్రారంభించారు. అనంతరం గ్రామంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐత్‌రాజ్‌పల్లి గ్రామ పరిధిలో రూ.3కోట్ల వివిధ అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని అలాగే గ్రామ పరిధిలోని మైసమ్మగుట్ట ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.కోటిని కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఎస్సీ కమిటిహాల్ భవనానికి నిధులను మంజూరి చేస్తానని ఎమ్మెల్యే హామి ఇచ్చారు,

Comments

comments