Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం

The goal of development of the Dornakal constituency

మన తెలంగాణ/కురవి ః డోర్నకల్  నియోజకవర్గ అ భివృద్ధే  ద్యేయమని డోర్నకల్  నియోజకవర్గం శాసన సభ్యులు డి ఎస్ రెడ్యానాయక్ అన్నారు. ఆదివారం మండలంలోని సీరోలు గ్రామంలో రూ. కోటి వ్యయం తో  నిర్మించిన 33/11 కెవి సబ్‌స్టేషన్ ప్రారంభించిన అనంతరం గ్రామాలో అంతర్గత రోడ్లకు రూ. 25 లక్ష ల వ్యయంతో సిసిరోడ్లు, 6 ఓవర్‌హెడ్ ట్యాంకులకు శంకుస్థాపనలు చేశారు.  ఈ సందర్భంగా డిఎస్ రె డ్యానాయక్ మాట్లాడుతూ డోర్నకల్ నియోజకవర్గం దేవాలయం,ప్రజలు దేవుళ్ళని, అందులో సేవలు చేసే భాగ్యం నాకు కలిగినందుకు పుణ్యంచేసుకున్నాని అ న్నారు. కెసిఆర్ ప్రభుత్వంలో నియోజకవర్గంలోని ప్ర తి తండాకు, గ్రామాలకు తార్‌రోడ్ల అభివృద్ధి చేశానని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సే వచేశానని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద ప్రజలు శుబిక్షంగా ఉండటం కోసం తెలంగాణలో పు ట్టిన ప్రతి ఆడబిడ్డకు కళ్యాణలక్ష్మి పథకం, రైతులకు రైతుబంధు పథకం, లాంటి అనేక పథకాలు అమలు చేసిన ఘనత కెసిఆర్‌కే దక్కిందన్నారు. డిశంబర్ నెలాఖరిలోగా మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి శుద్ధిచేసిన తాగునీరు అందిస్తామని, అలాగే రైతుల ప ంటలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందిస్తామని రెడ్యా హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో కేవ లం ప్రజలను ఓటు అడిగే హక్కు టిఆర్‌ఎస్ పార్టీకే ఉ ందని అన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో గ్రామాల్లోని కార్యకర్తలు సైనికుళ్ళా పనిచేసి సర్పంచు అభ్యర్థుల ను అధిక మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. కెసిఆర్ రాష్ట్రంలో చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని అన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు లేని ఆరోపణ లు చేస్తున్నాయని అన్నారు. తప్పుడు మాటలు మా ట్లాడే వరికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పుతారని రెడ్యా అన్నారు. ఈ కార్యక్రమంలో  మండల ఎంపిపి బజ్జూరి ఉమాపిచ్చిరెడ్డి, జడ్పిటిసి కవితవిజయ్,  టిఆర్‌ఎస్  మండల అధ్యక్షులు తోట లాల య్య, జిల్లా నాయకులు బజ్జూరి పిచ్చిరెడ్డి, డోర్నకల్ నియోజకవర్గం యువజన నాయకులు డి ఎస్ రవిచంద్ర, రాజవర్దన్‌రెడ్డి,  రైతు సమన్వయ కమిటి మం డల అధ్యక్షులు ముళ్ళ రమేష్ తదితరులు పాల్గొన్నా రు.

Comments

comments