Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

దీపావళి నాటికి రూ.34 వేలకు పసిడి

Gold Slumps By Rs 300 On Weak Global Cues Low Demand

రూపాయి బలహీనంతో పెరగనున్న బంగారం ధర
న్యూఢిల్లీ: బంగారం ధర మరింతగా పెరనుందా? అంటే నిపుణులు అవుననే చెబుతున్నారు. దీపావళి నాటికి పసిడి ధర పది గ్రాములు రూ.34 వేలకు చేరనుందని అంటున్నారు. రూపాయి విలువ క్షీణించడం, బౌగోళిక రాజకీయ ఆందోళనలే బంగారం ధర పెరుగుదలకు ప్రధాన కారణమని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 10 గ్రాముల పసిడి ధర రూ.30వేల నుంచి రూ.34వేల మధ్య ఉండే అవకాశం ఉందని, అంతర్జాతీయంగా ఔన్సు ధర 1,260 డాలర్ల నుంచి 1,400 డాలర్ల మధ్య ఉండవచ్చని కామ్‌ట్రెండ్జ్ రిస్క్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ జ్ఞానేశ్వర్ త్యాగరాజన్ తెలిపారు. జూన్ 8న నాటికి దేశీయంగా 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.31,010 ఉండగా, న్యూయార్క్‌లో ఔన్సు 1,302.70 డాలర్లుగా ఉంది. అయితే వడ్డీరేట్ల కోతతో డాలర్‌పై మరింత ఒత్తిడి పెరిగి అమెరికాలో వ్యాపారంపై ప్రభావం చూపుతుందని, ఈ కారణంగా ఇన్వెస్టర్లు రెండో త్రైమాసికంలో బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపే అవకాశముందని ఆయన తెలిపారు. కమొడిటీ అండ్ కరెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతి రాతి మాట్లాడుతూ, దీపావళి నాటికి బంగారం ధర రూ.31,500 నుంచి రూ.-31,800 మధ్య ట్రేడ్ కావొచ్చని అన్నారు. 2018 చివరి నాటికి రూ.31,800 వరకూ ఉండవచ్చని పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా ఆశాజనకంగా ఉందని, రేటు పెంపు ఉండే అవకాశముందని ఏంజెల్ బ్రోకింగ్ ప్రధాన విశ్లేషకుడు ప్రథమేష్ మలాయ అన్నారు. దీపావళి నాటికి రూ.30 వేల నుంచి రూ.31,500 మధ్య ఉండొచ్చని తెలిపారు.

Comments

comments