Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

వానలు… వరదలు

The heavy rains broke out and the routes stopped
మంచిర్యాల: జిల్లాలో సోమవారం కురిసిన భారీ వర్షాలకు పలు చోట్ల వాగులు ఉప్పొంగి రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దాదాపు జిల్లాల్లో 24 గ్రామాలకు రవాణా సౌకర్యాలు స్తంభించిపోయాయి. పలు రూట్లలో అధికారులు ఆర్‌టిసి బస్సులను నిలిపివేశారు. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో పలు గ్రామాలు అందకారమయమయ్యాయి. పలు చోట్ల భారీ వృక్షాలు విరిగిపోయి రోడ్డుకు అడ్డంగా పడడంతో రాకపోకలకు అంతరాయాలు ఏర్పడినాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా తొలకరి వర్షాలకే మారుమూల ప్రాంతాల్లోని రోడ్లన్ని బురదమయంగా మారి కాలినడక కూడా కష్టంగా మారింది. వాగులు ఉప్పొంగడంతో అత్యవసర పనుల నిమిత్తం ప్రజలు ప్రాణాలకు తెగించి వాగులను దాటుతున్నారు. పలు చోట్ల వాగులు దాటకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలోని జన్నారం, లక్షెట్టిపేట, దండేపల్లి, భీమారం, చెన్నూర్, వేమనపల్లి, పలు మండలాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. చెన్నూర్ మార్గంలోని సుద్దాల వాగు, దహెగాంలోని ఎర్రవాగు, బెజ్జూర్‌లోని మత్తడి వాగులు, ఉప్పొంగగా జన్నారంలోని తాత్కాలిక రోడ్డు భారీ వర్షాలకు కొట్టుకొపోయింది. దీంతో రాకపోకలు పూర్తిగా స్తంభించి, విద్యార్థులు సైతం ఇండ్లకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. అంతే కాకుండా జిల్లా వ్యాప్తంగా 9 ఇండ్లు, మరో 12 ఇండ్ల గోడలు కూలిపోయినట్టు సమాచారం అందింది. వాగులు ప్రతి సంవత్సరం ఉప్పొంగడం వల్ల మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయినప్పటికి వంతెనలు నిర్మించే విషయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

Comments

comments