Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

కృష్ణానదిలో ఆడ్డుకట్ట పనులను పరిశీలించిన జూపల్లి…

The krishna nadi in the works every jupalli...

కొల్లాపూర్‌: మండల పరిధిలోని అమరగిరి గ్రామ సమీపంలోని కోతిగుండు ప్రాంతంలో కృష్ణానది ద్వారా ప్రవహించే నీటిని నిలువ చేసేందుకు చేపట్టిన ఆడ్డుకట్ట పనులను రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం పరిశీలించారు. 9కోట్ల రూపాయలతో 70అడుగుల ఎత్తుకు నిర్మిస్తున్న అడ్డుకట్ట పనుల గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడినుండి కెఎల్‌ఐ ప్రాజెక్టుకు ఈ నీటిని పంపు చేసి అక్కడి నుండి వివిధ జిల్లాలకు సరఫరా చేస్తారు. ఈపనులను త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. అనంతరం పట్టణంలో ఎస్‌బిహెచ్ బ్యాంక్‌లో రైతు బంధు చెక్కులను గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డబ్బులు ఇవ్వాలని బ్యాంక్ అధికారులకు సూచించారు. అనంతరం తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా స్టేడియం గ్రౌండ్‌లో జరుగుతున్న వాలీబాల్ టోర్నిమెంట్‌ను సందర్శించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి చిన్న నిరంజన్‌రావు. జడ్‌పిటిసి హన్మంత్‌ నాయక్, మార్కెటు యార్డు వైస్ చైర్మన్ ఎక్బల్, టిఆర్‌ఎస్ యువ నాయకులు నరసింహ్మరావు, బోరెల్లి మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments