Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

నైరుతికి తోడు వాయుగుండం

రాష్ట్రంలో పూర్తిగా విస్తరించిన రుతుపవనాలు
ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతున్న అల్పపీడనం
వచ్చే మూడు రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు
శంషాబాద్‌లో 5.2 సె.మీ

Cyclone

హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో పూర్తి గా విస్తరించాయి. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. ఆదివారం పలు చోట్ల వర్షం కురిసింది. శంషాబాద్‌లో గరిష్ఠంగా 5.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పోచట్‌పల్లి, మంగల్‌పల్లిలో 4.4, మల్దకల్, దస్తూరాబాద్‌లో 3.8, మామిడిపల్లిలో 3.6, హసన్‌పల్లిలో 3.5, చెన్నూరు, ఇబ్రహీంపట్నంలో 3.4, కాళేశ్వరంలో 2.8, జుకల్, మేడపల్లిలో 2.6, బోరంపల్లిలో 2.5, కొత్తగూడెంలో 2.3, లక్నెపల్లిలో 2.2, దేవులవాడలో 2.1, నెన్నల్‌లో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే విధంగా ఖానాపూర్‌లో 19, భువనగిరి, పెద్దకొత్తపల్లిలో 1.8, మానూరు, ముక్తాపూర్, మంగలవారిపేట, చెన్నరావుపేట, సర్ధానాలో 1.6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది.

Comments

comments