Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

ఆర్‌బిఐకి మరిన్ని అధికారాలివ్వాలి

urjit

 ప్రభుత్వరంగ బ్యాంకులను పర్యవేక్షించాల్సి ఉంది

 బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్ఠానికి చర్యలు చేపట్టాం 

ఆడిట్‌లో ప్రతి బ్యాంక్ బ్రాంచ్‌ను పరిశీలించలేం 

పార్లమెంట్ ప్యానెల్ ఎదుట గవర్నర్ ఉర్జిత్ పటేల్

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులను(పిఎస్‌బిల) పర్యవేక్షించేందుకు ఆర్‌బిఐకి మరిన్ని అధికారాలు అవసరమని ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) గవర్నర్ ఉర్జిత్ పటేల్ పార్లమెంటరీ ప్యానెల్‌కు తెలిపారు. పిఎస్‌బిల్లో మొండి బకాయిలు పెరిగిన నేపథ్యంలో వాటిపై నిఘా అవసరమని మంగళవారం పార్లమెంటరీ ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ ఎదుట హాజరైన ఉర్జిత్ చెప్పారు. మొండి బకాయిలు, నగదు కొరత, ఇతర అంశాలపై ఉర్జిత్‌ను ప్యానెల్ సభ్యులు ప్రశ్నించారు. బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని గవర్నర్ సభ్యులకు హామీ ఇచ్చారు. మూడున్నర గంటల పాటు ప్యానెల్ సభ్యులు ఆయనను పలు అంశాలపై ప్రశ్నించారు.
దివాలా చట్టంతో మెరుగవుతున్న పరిస్థితి
దేశ బ్యాంకింగ్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా చెబుతున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్‌పై ప్యానెల్ పలు ప్రశ్నలు అడిగారు. ఇన్నేళ్ల నుంచి పిఎన్‌బి కుంభకోణం జరుగుతున్నా ఎందుకు జోక్యం చేసుకోలేదని ఉర్జిత్‌ను ప్రశ్నించారు. మొండి బకాయిలు పెరిగి సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వరంగ బ్యాంకుల పరిస్థితిపై ఉర్జిత్ వివరణ ఇచ్చారు. బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, సంక్షోభం నుంచి బయటపడతామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దివాలా చట్టం అమలు తర్వాత మొండి బకాయిల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయని, ఇప్పుడు పరిస్థితి మెరుగవుతోందని ప్యానెల్ తెలియజేశారు. ప్రభుత్వరంగ బ్యాంకులపై ఆర్‌బిఐకి తగినంతగా అధికారాలు లేవని, మరిన్ని అధికారాలు ఇస్తే పిఎస్‌బిలను నియంత్రించవచ్చని ప్యానెల్‌కు ఉర్జిత్ చెప్పారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా మొత్తం 21 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉన్నాయి. 201718 ఆర్థిక సంవత్సరంలో వీటి మొత్తం నష్టం రూ.87,300 కోట్లు నమోదైంది. వీటిలో వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ మోసానికి పాల్పడిన పంజాబ్ నేషనల్ బ్యాంక్(పిఎన్‌బి) వాటానే అత్యధికంగా రూ.12,283 కోట్లు ఉండడం గమనార్హం. పిఎన్‌బి తర్వాత ఐడిబిఐ బ్యాంక్‌కు భారీ నష్టాలు వచ్చాయి. మొత్తం 21 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రెండు బ్యాంకులు.. ఇండియన్ బ్యాంక్, విజయా బ్యాంక్‌లు మాత్రమే లాభాలను నమోదు చేశాయి. ఇండియన్ బ్యాంక్ అత్యధికంగా రూ.1,259 కోట్ల లాభాన్ని, అలాగే విజయా బ్యాంక్ రూ.727 కోట్లు లాభాన్ని ఆర్జించింది. మిగతా 19 ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.87,357 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయని బ్యాంకులు విడుదల చేసిన త్రైమాసిక గణాంకాలు చెబుతున్నాయి. 2017 డిసెంబర్ నాటికి మొత్తం బ్యాంకింగ్ రంగం స్థూల ఎన్‌పిఎ(నిరర్థక ఆసులు) రూ.8.31 లక్షల కోట్లకు చేరాయి. పిఎన్‌బిలో రూ. 13 వేల కోట్ల నీరవ్ మోడీ మోసంపై ప్రశ్నలకు ఉర్జిత్ సమాధానమిస్తూ.. ఆడిట్‌లో ప్రతి బ్యాంక్ బ్రాంచ్‌ను పరిశీలించడం సాధ్యం కాదని చెప్పారు. అయితే 21 పిఎస్‌బిలలో 11 బ్యాంకుల మొండి బకాయిలు పెరగడంతో బలహీనపడ్డాయి. వీటిని రిజర్వు బ్యాంక్ పిసిఎ(తక్షణ దిద్దుబాటు చర్య) పరిధిలోకి చేర్చింది. మూడు రోజుల క్రితం ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లతో సమావేశమైన కేంద్ర ఆర్థికమంత్రి పియూష్ గోయల్ మొండి బకాయిల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఒత్తిడి రుణాల వేగవంత పరిష్కారం కోసం ఎఆర్‌సి(అస్సెట్ రికన్‌స్ట్రక్షన్ కంపెనీ) ఏర్పాటుపై రెండు వారాల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పిఎన్‌బి(పంజాబ్ నేషనల్ బ్యాంక్) నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సునీల్ మెహ్తా ఆధ్వర్యంలోని ఈ కమిటీ ఏర్పాటు చేశారు.
ఎటిఎంలలో నగదు కొరత
కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ ఆధ్వర్యంలో క మిటీ సభ్యులు ఇటీవల ఎటిఎంలలో నగదు కొరత ఏర్పడడంపై ప్రశ్నించారు. ఎటిఎంలలో నగదు లేకపోవడానికి గల కారణాలేమిటి? చెప్పాలని అన్నారు. అలాగే 2016 నవంబర్ 8న ప్రధాని మోడీ ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణ యం తర్వాత ఇప్పటివరకు ఎంత నగదు తిరిగొచ్చిందో లెక్కలు చెప్పాలని కమిటీ ఆయనను ఆదేశించింది.

Comments

comments