Search
Tuesday 19 June 2018
  • :
  • :

కన్నపేగును మరిచిన కసాయి తల్లి 

The mother who gave Poisoning for three children

కామారెడ్డి: ఆ చిన్నారులకు మమతానురాగాలు కరువు అయ్యాయి. నవ మాసాలు మోసి పిల్లలకు జన్మనిచ్చిన కన్నతల్లె పేగు బందాన్ని మర్చిపోయింది. ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి తాను సేవించింది. అందులో 8నెలల ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ఈ ఘటన గాంధారి మండలం గుర్జాల్ గ్రామంలో జరిగింది. సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన సుజాతను గాంధారి మండలం గుర్జాల్ గ్రామానికి చెందిన పడమటి ఉమేష్ తో 2009లో వివాహం జరిగింది. వీరికి నందిని(07), 8నెలల కవల పిల్లలు ధనుష్ ధరిణి ఉన్నారు. ఇన్నేల్లు కాపురం బాగానే జరిగింది. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు ఉపాది హామీ పనులకు వెళ్లారు. ఇంట్లో సుజాత తన పిల్లలతో ఉంది. ఏమైందో ఏమో తెలియదు గానీ పెద్దమ్మాయి నందినికి జ్యూస్ అని చెప్పి పురుగుల మందు తాగించింది. అదే మందును తాను తాగి అభం శుభం తెలియని పసికందులకు కూడ పట్టించింది. దాంతో పిల్లల పరిస్థితి విషమంగా తయారైంది. గమనించిన చుట్టు పక్కల వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే నలుగురిని కామారెడ్డి ప్రవేటు ఆసుపత్రికి తరిలించారు. విషమించిన సుజాతను ఎల్లారెడ్డి పేటకు తరలించారు. కామారెడ్డిలో పిల్లలను పరీక్షించిన వైద్యులు 48 గంటలు గడిస్తే తప్ప ఏమి చెప్పలేమని వైద్యులు చెప్పారు. పిల్లలను కూడ ఎల్లారెడ్డిపేట ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యయత్నాలకు కారణమని గ్రామస్తులు తెలిపారు.

Comments

comments