Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

వంకాయ కూరలో ఎలుక ప్రత్యక్షం: వ్యక్తికి అస్వస్థత

rat-in-meals

వరంగల్: ఎలుక వచ్చిన భోజనం తిని ఓ వ్యక్తి వాంతులతో అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటన వరంగల్ లో చోటుచేసు కుంది. వివారాల్లోకి వెళితే… వరంగల్ నగరానికి చెందిన రమేశ్ భార్య హన్మకొండ సుబేదారిలోని రోహిణి దావాఖానలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో రమేశ్.. భోజనం చేసి తన భార్యకు కూడా పార్సిల్ తీసుకెళ్లడానికి ఓ హోటల్‌కు వెళ్లాడు. భార్యకు భోజనం ఆర్డర్ చేసి, తాను భోజనం చేస్తున్న సమయంలో ఆలూ వంకాయ కూరలో ఎలుక ప్రత్యక్షమైంది. అయితే అది వంకాయ ముక్క అనుకొని నోట్లో పెట్టుకున్న క్రమంలో ఎలుకను గుర్తించాడు. దీంతో సదరు వ్యక్తి స్వల్ప అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నాడు. హోటల్ యాజమాన్యం నిర్లక్షంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Comments

comments