Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

రెండో రోజూ ఆర్‌బిఐ జోష్

sensecs

 10750 పాయింట్ల దాటిన నిఫ్టీ
 ఇంట్రాడేలో 400 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

ముంబై: ఆర్‌బిఐ వడ్డీ రేట్ల పెంపును ఇన్వెస్టర్లు స్వా గతించడంతో వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, ఆర్‌బిఐ పాలసీ నిర్ణయాల పట్ల మార్కెట్లు సా నుకూలంగా స్పందించడంతో కొనుగోళ్లు వెల్లువెత్తా యి. రూపాయి బలహీనపడంతో ఐటీ షేర్లు ర్యాలీ చేయగా, మరోవైపు ప్రాధాన్యతా రంగం కింద గృహ రుణాల పరిమితిని పెంచడంతో రియల్టీ షేర్లు లాభపడ్డాయి. వడ్డీ రేట్లకు సంబంధించిన రంగాలైన బ్యాంకింగ్, ఆటో, రియల్టీ షేర్ల కొనుగోళ్లతో పాటు మెటల్ షేర్ల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 284 పాయింట్లు పెరిగి 35,463 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 84 పాయింట్లు లాభపడి 10,768 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 400 పాయింట్లు పెరిగి 35,575ను తాకింది. ఎన్‌ఎస్‌ఇలో అన్ని రం గాలూ లాభపడ్డాయి. రియల్టీ, మెటల్, ఐటి, ఎఫ్‌ఎంసిజి, బ్యాంకింగ్, ఐటి లాభాల పంటపండించాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా స్టీల్, టాటా మోటార్స్, ఐబి హౌసింగ్, ఐసిఐసిఐ, యాక్సిస్, ఏసియన్ పెయిం ట్స్, విప్రో, యుపిఎల్, ఆర్‌ఐఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్ కూడా మంచి లాభాలను ఇచ్చాయి. అయితే టైటన్, ఐషర్, ఇండస్‌ఇండ్, కోల్ ఇండియా, లుపిన్ షేర్లు మాత్రం స్వల్పంగా క్షీణించాయి. మార్కెట్ల బాటలో చిన్న షేర్లకూ డిమాండ్ పెరిగింది. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు పుంజుకున్నాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1951 లాభపడగా, 750 షేర్లు మాత్రమే నష్టాలతో ముగిశాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) నామమాత్రంగా రూ. 81 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. ఇక దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ. 712 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.

Comments

comments