Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

మూడో రోజూ లాభాల్లో సూచీలు

 The stock market index gained for the third straight day

ముంబై: ప్రపంచ సానుకూల సంకేతాలతో వరుసగా మూడో రోజూ స్టాక్‌మార్కెట్ సూచీలు లాభాలను నమోదు చేశాయి. క్రితం రోజు మాదిరిగానే ఆఖరి సమయంలో అమ్మకాల ఒత్తిడితో సూచీలు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 47 పాయింట్ల స్వల్ప లాభంతో 35,739 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ 14 పాయింట్లు పెరిగి 10,857 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఇలో ప్రధానంగా పిఎస్‌యు బ్యాంక్, ఐటి రంగాలు 1.5 శాతం, ఐటి 1 శాతం లాభపడింది. ఎఫ్‌ఎంసిజి, మెటల్ రంగాలు 0.5 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 35,877 వద్ద గరిష్ఠానికి చేరింది. ప్రధానంగా డాక్టర్ రెడ్డీస్, సిప్లా, టిసిఎస్, హిందాల్కో, లుపిన్, టైటన్, ఎస్‌బిఐ, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్ షేర్లు పెరిగాయి. మరోవైపు టాటా స్టీల్, జి, బజాజ్ ఫైనాన్స్, ఎయిర్‌టెల్, హెచ్‌యుఎల్, వేదాంతా, హెచ్‌పిసిఎల్, ఐటిసి స్వల్పంగా క్షీణించాయి. బిఎస్‌ఇలో మిడ్ క్యాప్ సూచీ 0.5 శాతం బలహీనపడింది. ట్రేడైన మొత్తం షేర్లలో 1383 షేర్లు నష్టపోగా, 1294 షేర్లు లాభపడ్డాయి. మంగళవారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) రూ. 1169 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. అలాగే దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ. 1327 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేశాయి.

Comments

comments