Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

మైనార్టీల సంక్షేమానికి చేయూత

The welfare of minorities support

పేదరికాన్ని నిర్మూలించడమే లక్షం
పథకాల అమలుతో కొత్త జోష్
మైనార్టీ విద్యార్థులకు గురుకులాలు
కుట్టుమిషన్ల పంపిణీ
కరీంనగర్ ఎంఎల్‌ఎ గంగులకమలాకర్,
జడ్‌పి చైర్ పర్సన్ తుల ఉమ, మైనార్టీ
కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్

మనతెలంగాణ/కరీంనగర్‌టౌన్: మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం చేయూత వేస్తుందని ఎంఎల్‌ఎ గంగు ల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరే ట్ ఆడిటోరియంలో పేద ముస్లిం మైనార్టీలకు మం జూరైన 300 కుట్టు మిషన్‌లను ఎంఎల్‌ఎ,మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్‌తో కలసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడు తూ ముస్లిం మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలతో పాటు వాటి అమలులోని ప్రత్యేక చొరవ తీసుకుంటుందని అన్నారు. ప్రభు త్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల అ మలుతో వారి జీవితా ల్లో కొత్త జోష్ వచ్చింద ని అన్నారు.ప్రతిఏట స ంక్షేమానికిపెద్దఎత్తున నిధుల కేటాయింపుతో పాటుముస్లింల అభివృ ద్ధిప్రత్యేకంగాసిఎం దృ ష్టి సారించారు. సమై క్య పాలనలో మైనార్టీలపై కమ్ముకున్న నీలినీడలు స్వరాష్ట్రంలో సిఎం కెసిఆర్ పాలనలో ఒక్కొక్కటి గా తొలుగుతున్నాయి.మైనార్టీల అభివృద్ధి,సంక్షేమమే ధ్యేయంగాసర్కార్ ప్రవేశపెడుతున్న పథకాలు ముస్లింలను స్వర్ణయుగపు బాట పట్టిస్తున్నాయన్నారు. సిఎం కెసిఆర్ స్వయంగా మైనార్టీ సంక్షేమ శాఖ నిర్వహి స్తూ ఆ వర్గాల అవసరాలను తీర్చడంతోపాటు పేదరికాన్ని రూపుమాపటానికి ఒక్కొక్కటిగా కార్యక్రమాల ను ఆచరణలోకి తీసుకువస్తున్నారు. సమైక్య పాలనలో నిధుల కేటాయింపు నామమాత్రంగా జరుగగా, టిఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేండ్లలోనే మైనార్టీల సం క్షేమం కోసం భారీ ఎత్తున నిధులను కేటాయించింది. ఊహించని రీతిలో నిధుల కేటాయింపుతో ఆ వర్గాలే ఆశ్చర్యానికి గురవుతున్నాయన్నారు. జడ్‌పి చైర్ ప ర్సన్ తుల ఉమ మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలన్నారు.అన్ని వర్గాల సంక్షేమమే ధ్యే యంగాప్రభుత్వం ముందుకు సాగుతుందన్నా రు.పేదల్లో వెలుగులు నింపేందుకే సిఎం కేసీఆర్ పథకాలు ప్రవేశపెట్టి అర్హులకు అందిస్తున్నారన్నారు. మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అ క్బర్ హుస్సేన్ మాట్లాడుతూ గత ప్రభుత్వాల నిర్లక్షంవల్ల ముస్లిం మైనార్టీలకు తీరని అ న్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అ ధికారంలోకి వచ్చాక ముస్లిం మైనార్టీల స ంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో కూడా సిఎం కెసిఆర్‌ను ఆధికారంలో కి తీసుకురావడమే తమ ధ్యేయమన్నారు. మే యర్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రతి ఒక్కరూ స ద్వినియోగం చేసుకోవాలన్నారు.అర్హులందరికి దశల వారీగా ప్రభుత్వం పథకాలు అందుతాయన్నారు. బంగారు తెలంగాణ లక్షంగా ప్ర తి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. స్మార్ట్ సి టీలో భాగంగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని అందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. డిప్యూటీ మే యర్ గుగ్గిల్లపు రమేశ్ మాట్లాడుతూ ప్రతి ఒ క్కరి సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముం దుకు సాగుతుందని తెలిపారు. ఏ ప్రభుత్వాలు ప్రవేశపెట్టని పథకాలను సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టి అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు.

ముస్లిం ఆడబిడ్డలకు షాదీముబారక్ : ఎంఎల్‌ఎ గంగుల
షాదీముబారక్ పథకంతో సిఎం కెసిఆర్‌కు ఎ నలేని ఆదరణ లభిస్తున్నదని, ఉమ్మడి రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం పేద మైనార్టీ యువతు ల వివాహానికి కంటితుడుపుగా కేవలం 15 వే ల రూపాయల సామాగ్రిని అందజేసిందన్నా రు.కెసిఆర్ సిఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెడుతూ ఉత్తర్వులుజారీ చేసి ప్రారంభించారన్నారు. తొ లుత ఈ పథకం కింద 51 వేల నగదు ఇచ్చేవారని,ఆ మొత్తం కూడా సరిపొవడంలేదని భావి ంచిన కెసిఆర్ రూ 75,116 నుంచి లక్ష నూట పదహారుకు పెంచుతూ ఆదేశాలు జారీచేశారన్నారు. ఆర్థిక స్థోమతలేక, కుటుంబ పరిస్థితు లు అనుకూలించక చదువుకోలేని మైనార్టీ వి ద్యార్థులను బడిబాట పట్టించాలని భావించారన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి మరో ప ది మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలలు అందుబాటులోకి రానున్నాయని, సంస్కృతి సంప్రదాయాలకు చేయూత వేసే తెలంగాణ స ర్కారు మైనార్టీల పండుగలకు ప్రాధాన్యమిస్తున్నదని అన్నారు. నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ గిప్ట్ ప్యాకెట్లు గత మూడేండ్లుగా అందజేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమం లో జడ్‌పి చైర్మన్ తుల ఉమ, మేయర్ సర్ధార్ ర వీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ రమేష్, కార్పొరేటర్లు,మైనార్టీ అధికారులు పాల్గొన్నారు.

Comments

comments