Search
Tuesday 19 June 2018
  • :
  • :

నిజామాబాద్ లో భారీ చోరీ..

Thieves Robbery In House In Nizamabad
నిజామాబాద్ క్రైం ః నగరంలోని అరుంధతి నగర్‌లో తాళం వేసిన ఇంట్లో అర్ధరాత్రి దొంగలు పడ్డారు. కాలనికి చెందిన ఇంటి యజమాని మరమ్మత్తులతో మరో ఇంట్లో అద్దెకు ఉండటం గమనించిన దొంగలు తాళం పగలగొట్టి భారీ సొత్తును అపహరించారు. బంగారం, వెండి, నగదు దొంగతనం జరిగిన సంఘటన శనివారం తెల్లవారుజామున 3వ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి దుబ్బా, అరుంధతినగర్‌లో చోటు చేసుకుంది. 3వ టౌన్ ఎస్ఐ కృష్ణ కథనం ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి.. అరుంధతి నగర్‌కు చెందిన గడుగు నాగభూషణం, బ్యాంక్ అటెండర్‌గా పని చేస్తున్నాడు. తన ఇంటికి రిఫేర్ చేయిస్తూ శుక్రవారం రాత్రి ఇంటికి తాళం వేసి తన బంధువుల ఇంట్లో ఉంటున్నాడని తెలిపారు. ఇంటికి తాళం ఉన్న విషయాన్ని పసిగట్టిన దొంగలు అర్థరాత్రి తాళం పగల గొట్టి బీరువాలో ఉన్న 32తులాల బంగారం, 20తులాల వెండి, 38వేల నగదు, విలువైన వస్తువులు దొంగిలించారు. శనివారం నాగభూషణం తన ఇంటికి వచ్చే సరికి తాళం పగిలి ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండటం చూసి 3వ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు.ఎస్ఐ  కృష్ణ ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇంటి యాజమాని గడుగు నాగభూషణం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

comments