Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

ప్రపంచ దృష్టిని ఆకర్షించాం

 Three installments under Mission Kakatiya

మిషన్ కాకతీయ కింద మూడు విడతలలో 1057 చెరువులలో పూడిక తీత పనులు చేపట్టడం జరిగిందన్నారు. గొల్ల కురుమల సంక్షేమం కోసం రూ. 105 కోట్ల వ్యయంతో 8400 యూనిట్ గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 137 పశు వైద్య కేంద్రాలు, 5 సంచార పశు వైద్యశాల ద్వారా వైద్య సేవలదిస్తున్నామన్నారు, కెసిఆర్ కిట్ పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు 19 వేల మంది గర్భిణీలను నమోదు చేసి వారికి వివిధ దశల్లో రూ. 11 కోట్లు  పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 9 మైనార్టీ, 8 బిసి, 19 ఎస్‌సి, 1 ఎస్‌టి గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి విద్య అందిస్తున్నామన్నారు. 5.18 లక్షల మందికి రూపాయికి కిలో బియ్యం అందచేస్తున్నామన్నారు. సామాజిక భద్రత క్రింద 1.74లక్షల లక్షల మందికి రూ. 21 కోట్లు పెన్షన్ అందచేస్తున్నట్లు వివరించారు. జిల్లాలో ఇప్పటివరు ఎడు వేల మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముభారక్ కింద పెళ్లకు ఆర్థిక సహాయం అందచేశామన్నారు. గుడంబా రహిత జిల్లాగా  తీర్చిదిద్ది నాలుగు వందల మందికి రెండు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందచేసి ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా జిల్లాలోని 11 గ్రామ పంచాయతీలను ఇప్పటికే బహిరంగ మల మూత్ర విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించడం  జరిగిందన్నారు. అమరవీరులతో పాటు వివిధ రంగాలలో ఉత్త మ ప్రతిభ కనబరిచిన 16 మందికి నగదు పురస్కారాలతో పాటు శాలువా, మెమోంటోలతో మంత్రి సత్కరించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ రఘునందన్‌రావు, రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్, జిల్లా జాయింట్ కలెక్టర్ హరీష్, డిఆర్‌ఒ శోభలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Comments

comments