Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

టిప్పర్-లారీ ఢీ.. డ్రైవర్ మృతి

Tippet Driver Dies In Road Accident In Rangareddy

కొందుర్గుః అతివేగం.. అజాగ్రత్తగా వచ్చిన లారీ  టిప్పర్‌ను ఢీకొట్టడంతో టిప్పర్  డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన కొందుర్గు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంచంద్రాపూర్ వద్ద చోటు చేసుకుంది. ఎఎస్ఐ రాంచంద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం పరిగి నుండి బాలానగర్‌లో రోబో డస్ట్ తీసుకురావడానికి టిప్పర్ ఎపి 22డబ్లు5243 వెళుతుండగా షాద్‌నగర్ నుండి వస్తున్న లారీ ఎపి09వై7646 అతి వేగంతో టిప్పర్‌ను రాంచంద్రాపూర్ వద్ద బుధవారం రాత్రి 10.45 గంటలకు ఢీకొట్టింది. దీంతో టిప్పర్ డ్రైవర్ శివకుమార్(21)కు తీవ్ర గాయాలు కాగా పక్కనే ఉ్నన వాటర్ ప్లాంట్ వాచెమెన్ 108కి సమాచారం అందించడంతో 108లో మెరుగైన చికిత్స కోసం ఉస్మానియాకు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి 2.00 గంటలకు శివకుమార్ మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎఎస్ఐ తెలిపారు.

Comments

comments