Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

బదిలీల సందడి షురూ…

Transfer of teachers in telangana

మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి : ఉపాధ్యాయుల బదిలీ సందడి మొదలైంది. చాలా రోజులుగా ఉపాధ్యాయులు బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. పట్టణాల్లో పనిచేసే వారు అలాగే ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు.. గ్రామాలకు వెళ్లే వారికి ఏళ్ల తరబడి అదే విధంగా వెళ్లక తప్ప డం లేదు. ఈ తరుణంలోనే నారాయణ్‌ఖేడ్, కంగ్టి, కల్హేర్, మానూర్, నాగల్‌గిద్ద, సిర్గాపూర్, రాయికోడ్, రేగోడ్ తదితర మారుమూల ప్రాం తాలలో విద్యాభోధన సమస్యగా మారింది. సజావుగా విద్యాభోధన సాగకుండా అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ సారి ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం ఈ సమస్య తొలగిపోతుందని అం తా భావిస్తున్నారు. ఏళ్ల తరబడి అనేక మంది ఒకే చోట పనిచేస్తుండటం, భార్య, భర్త వేరువేరు చోట్ల ఉద్యోగాలు చేయాల్సి రావడం లాంటి కారణాలు ఉపాధ్యాయులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. దీనిపై కొద్ది నెలలుగా ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని, షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌పై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించా రు. ఫలితంగా గురువారం బదిలీల షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభు త్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు అందగానే ఆ ప్రకారం కదిలేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ బదిలీల ద్వారా ఐనా తమకు న్యాయం జరుగుతుందని, కోరుకున్న చోట ఉద్యోగం చేసే అవకాశం లభిస్తుందని అనేక మంది భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలనే పాఠశాలలు తిరి గి ప్రారంభమయ్యాయి. బడిబాట కూడా జరుగుతోంది. ఈ తరుణంలో బదిలీల షెడ్యూల్ విడుదలైం ది. గత సంవత్సరం సిద్దిపేట, సంగారెడ్డి  జిల్లాలు ఏర్పాటయ్యాయి. పా త మెదక్ జిల్లాతో కలిపితే మూడు జిల్లాలుగా స్వరూపం మారింది. అయినప్పటికీ పాత జిల్లా ప్రాతిపదికన బదిలీలను నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి గాను విద్యాశాఖ అధికారులు, ఇంతకు ముందు కసరత్తు చేశారు. ఉపాధ్యాయుల నుంచి ధరఖాస్తులు స్వీకరించడం, జాబితాను రూపొందించడం, అభ్య ంతరాలను నమోదు చేయ డం, ఈ లోగా ఖాళీల జాబితాను రూపొందించడం, కౌన్సిలింగ్‌కు ఏర్పా ట్లు చేయడం లాంటి పనులన్నీ ఇప్పుడు వి ద్యాశాఖ చేయాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారం విద్యాశాఖ పరిధిలో నడుస్తుండటంతో ఇప్పుడు ఆ శాఖలో సందడి మొదలైంది. గురువారం షెడ్యూల్ విడుదల కాగానే అనే క మంది ఉపాధ్యాయ సంఘ నేతలు, ఉపాధ్యాయులు సంగారెడ్డిలోని డిఈవో కార్యాలయానికి చేరుకున్నారు. అధికారులతో సమావేశమయ్యా రు. నిబంధనలపై చర్చించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉపాద్యాయ బదిలీలు జరిపి ఆతర్వాత పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తారు. పంచాయతీ ఎన్నికలకు ఈ బదిలీ పర్వం అడ్డురాకుండా ఉండేందుకు ప్రభు త్వం ఈ మేరకు షెడ్యూల్‌ను రూపొందించింది.

Comments

comments