Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

సబ్బండ ప్రజలకు అండగా టిఆర్‌ఎస్

TRS Government Intraduce Welfare Scheme

మనతెలంగాణ/కోదాడ : తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా సబ్బండ వర్గాలకు వారి సంక్షేమానికి అండగా నిలుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కల్వకుంట్లచంద్రశేఖర్‌రావు అని ఆయన తెలిపారు. ఆదివారం స్థానిక పెణిక భవనంలో నిర్వహించిన కోదాడ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడుతూ దేశంలోనే సంక్షేమపధకాలను అమలుచేసి తెలంగాణరాష్ట్రం ప్రధమస్థానంలో నిలిచిందన్నారు. పేదలపక్షాపతిగా సీఎం కేసీఆర్ సబ్బండవర్గాలన్నింటికి సంక్షేమపధకాలు వర్తింపచేసేందుకు కృషిచేస్తున్నట్లు ఆయనతెలిపారు. గత పాలకులు 67 చరిత్రలో సాధించని అభివృద్ధిని టీఆర్‌ఎస్‌పార్టీ 4 సంవత్సరాల్లోపూర్తిచేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వనేదనని తెలిపారు. టీఆర్‌ఎస్‌ఫ్రభుత్వంపై కాంగ్రెస్‌నాయకులు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు.

రానున్న గ్రామపంచాయితీ ఎన్నికల్లో పార్టీనాయకులు, కార్యకర్తలు తెలంగాణరాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న అనేకసంక్షేమపదకాలను ఇంటింటికి ప్రచారం చేసి కోదాడనియోజకవర్గంలో ఉన్న అన్నిగ్రామపంచాయితీలల్లో గులాబీజెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు ఐక్యంగా ఉండాలని ఆయనపిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో కోదాడలో కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత కార్యకర్తలేదేననితెలిపారు. అ లాగే కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు మండల గ్రామకమిటిలు సిద్దంకావాలని గెలుపే లక్షంగా కృషిచేయాలని ఆయనతెలిపారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ రాష్ట్రప్రధానకార్యదర్శి ఏర్నేనిబాబు, డీసీసీబీ డైరెక్టర్ డేగబాబు, చిలుకూరు ఎంపీపీ నాగేంద్రబాబు, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముండ్రాసాంబశివరావు, మండలకార్యదర్శి శంకరశెట్టికోటేశ్వరరావు, సుంకర అజయ్, నాగయ్య, వెంకటరెడ్డి, సైదయ్య, దొడ్డాసురేష్, ఈదుల కృష్ణయ్య, కేఎల్‌ఎన్‌ఫ్రసాద్, నెమ్మాది భాస్కర్, పి వెంకటేశ్వర్లు, వెంకటనారాయణ, భరత్‌కుమార్ (నాని)మామడి రామారావు, శ్రీనివాస్‌గౌడ్, తుపాకుల భాస్కర్, టీఆర్‌ఎస్వీ అధ్యక్షులు లక్ష్మయ్య, యాతాకుల మధుబాబు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments